చిత్తూరు అర్బన్: జిల్లాలోని 9 మంది ఎస్‌ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ రిశాంత్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. బీఎన్‌ఆర్‌పేట ఎస్‌ఐ ప్రతాప్‌రెడ్డిని గంగవరం, నిండ్ర ఎస్‌ఐ వెంకటసు బ్బమ్మను బీఎన్‌ఆర్‌పేట, గంగవరం ఎస్‌ఐ వెంకట సుధాకర్‌రెడ్డిని తవణంపల్లె, ఇక్కడ పనిచేస్తున్న ప్రసాద్‌ను వీఆర్‌కు బదిలీ చేశారు. చిత్తూరు టూటౌ న్ ఎస్‌ఐ మల్లికార్జునను డీటీసీకి, పలమనేరు ఎస్‌ఐ నాగరాజును చిత్తూరు టూటౌన్‌కు, వీఆర్‌లోని లోకేష్‌ను వెదురుకుప్పం, చిత్తూరు పీసీఆర్‌లో ఉన్న రమణను చిత్తూరు సీసీఎస్‌కు, బైరెడ్డిపల్లె ఎస్‌ఐ వెంకట నరసింహులును సోమలకు బదిలీ చేశారు.