
హెచ్‌డీఎఫ్‌సీ ఫ్లెక్సీక్యాప్ ఫండ్
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడుల పట్ల ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్‌కు కొంత మొత్తాన్ని కేటాయించుకోవాల్సిందే. ఎందుకంటే అన్ని రకాల మార్కెట్ విభాగాల్లోనూ పెట్టుబడులు పెట్టే స్వేచ్ఛతో ఇవి పనిచేస్తుంటాయి. స్మాల్, మిడ్, లార్జ్‌క్యాప్ కంపెనీల్లో మెరుగైన అవకాశాలను గుర్తించి ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో రిస్‌్కను సమతుల్యం చేస్తూ.. మెరుగైన రాబడులను ఇచ్చే విధంగా ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ పనిచేస్తుంటాయి. ఈ విభాగంలో దశాబ్దాలుగా పనిచేస్తూ మంచి పనితీరు చూపిస్తున్న వాటిల్లో హెచ్‌డీఎఫ్‌సీ ఫ్లెక్సీక్యాప్ ముందుంది.
రాబడులు..
గత పదేళ్ల కాల పనితీరును గమనించినట్టయితే వార్షిక రాబడి 16 శాతం చొప్పున ఉంది. ఏడేళ్లలో 20 శాతం చొప్పున రాబడులను అందించింది. ఐదేళ్లలో 30 శాతం, మూడేళ్లలో 27.43 శాతం చొప్పున పెట్టుబడులపై ప్రతిఫలాన్ని అందించింది. గత ఏడాది కాల రాబడి 8.43 శాతంగా ఉంది. 1995లో ఈ పథకం మార్కెట్లోకి వచి్చంది. అప్పటి నుంచి చూస్తే వార్షిక రాబడి 18.92 శాతం చొప్పున ఉంది. ఇన్వెస్టర్లు నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసినట్టయితే.. మార్కెట్ పతనాలు, రంగాలు, కంపెనీల వారీ పరిణామాలను గమనించి సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం కష్టమైన పని. మ్యూచువల్ ఫండ్స్ మేనేజర్లు ఈ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలరు. కనుక సంపద సమకూర్చుకోవాలని భావించే వారు ఈక్విటీ ఫండ్స్‌కు తగినంత కేటాయించుకోవడం అవసరం. సిప్ ద్వారా కనీసం రూ.100 నుంచి ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
పెట్టుబడుల విధానం..
చురుకైన, క్రమశిక్షణతో కూడిన పెట్టుబడుల విధానం ఈ పథకంలో గమనించొచ్చు. భవిష్యత్తులో గొప్పగా వృద్ధి చెందే బలాలున్న కంపెనీలను గుర్తించి ఇన్వెస్ట్ చేస్తుంటుంది. పోర్ట్‌ఫోలియోలో తగినంత వైవిధ్యాన్ని నిర్వహిస్తుంది. ఫ్లెక్సీక్యాప్ విభాగంలో పోటీ పథకాలతో పోల్చి చూసినప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ ఫ్లెక్సీక్యాప్ ఫండ్ స్టాక్స్ నాణ్యత మెరుగ్గా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం పోర్ట్‌ఫోలియో పీఈ 17.68గా ఉంది. సగటున కంపెనీల వార్షిక వృద్ధి 27.42 శాతం చొప్పున ఉంది. క్వాలిటీ, వ్యాల్యూ వ్యూహాలను సైతం ఈ పథకం అమలు చేస్తుంటుంది. ఫ్లెక్సీక్యాప్ విభాగంలో ఈ పథకంతోపాటు పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీక్యాప్ ఫండ్ టాప్–2గా ఉన్నాయి.
పోర్ట్‌ఫోలియో..
ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.79,585 కోట్ల నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) ఉన్నాయి. ఇందులో 87 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసింది. డెట్ సాధనాల్లో 0.66 శాతం పెట్టుబడులు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ సాధనాల్లోనూ 2.62 శాతం మేర పెట్టుబడులు కలిగి ఉంది. 9.72 శాతం నగదు నిల్వలు ఉన్నాయి. మార్కెట్లు దిద్దుబాటుకు లోనైతే పెట్టుబడులకు వీలుగా నగదు నిల్వలు అధికంగా నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఈక్విటీ పెట్టుబడుల్లో 87 శాతం లార్జ్‌క్యాప్‌లోనే ఉండడం గమనార్హం. మిడ్ క్యాప్ స్టాక్స్‌లో 9 శాతం, స్మాల్‌క్యాప్ స్టాక్స్‌లో 3.91 శాతం చొప్పున పెట్టుబడులు కలిగి ఉంది.
లార్జ్‌క్యాప్ వ్యాల్యూషన్లు సహేతుక స్థాయిలో ఉండడంతో ఎక్కువ పెట్టుబడులు ఈ విభాగంలోనే ఉన్నట్టు తెలుస్తోంది. పోర్ట్‌ఫోలియోలో మొత్తం 51 స్టాక్స్ ఉన్నాయి. అత్యధికంగా 40 శాతం వరకు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత కన్జ్యూమర్ డి్రస్కీషినరీ కంపెనీలకు 16.99 శాతం, హెల్త్‌కేర్ కంపెనీలకు 8.64 శాతం, టెక్నాలజీ కంపెనీలకు 8.55 శాతం చొప్పున పెట్టుబడులు కేటాయించింది.