
లేకపోతే వేరే వాళ్లు మన తలరాత రాస్తారు
మౌనం వహిస్తే లొంగిపోయినట్లే..
విజ్లింగ్ ఉడ్స్ కార్యక్రమంలో గౌతమ్ అదానీ
న్యూఢిల్లీ: సినిమాలు, కొత్త టెక్నాలజీలు మొదలైన మాధ్యమాల ద్వారా అసమాన వృద్ధి గాథను అంతర్జాతీయంగా భారత్ స్వయంగా చాటి చెప్పాల్సిన అవసరం ఉందని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తెలిపారు. ‘మౌనం వహించడమనేది వినయం కాదు. లొంగిపోవడం. మన గురించి మనమే చెప్పుకోకపోతే, వేరే వాళ్లు మన గురించి ఇష్టమొచి్చనట్లుగా రాస్తారు’ అని ఫిలిం, కమ్యూనికేషన్స్, ఆర్ట్స్ సంస్థ విజ్లింగ్ ఉడ్స్ ఇంటర్నేషనల్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఉద్బోధించారు. పాశ్చాత్య దృష్టికోణంతో తీసిన గాం«దీ, స్లమ్‌డాగ్ మిలియనీర్‌లాంటి చిత్రాలే దీనికి నిదర్శనమన్నారు.
తన కథను ప్రపంచానికి చెప్పడంలో భారత్ విఫలమైనందునే, ఇతరులు వాస్తవ పరిస్థితులను మార్చేసి లబ్ధి పొందేందుకు ఆస్కారం లభించిందని అదానీ పేర్కొన్నారు. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. స్టోరీటెల్లింగ్ అనేది రెండు వైపులా పదునున్న కత్తిలాంటిదని ఆయన తెలిపారు. 2023లో అమెరికన్ షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌తో అదానీ గ్రూప్ మార్కెట్ విలువ ఎకాయెకిన 100 బిలియన్ డాలర్లు పడిపోయిందని, దశాబ్దాల కష్టం ఏ విధంగా తప్పుడు కథనాలతో రాత్రికి రాత్రి తుడిచిపెట్టుకుపోతుందనడానికి ఇది నిదర్శనమని అదానీ వ్యాఖ్యానించారు.
‘కొద్ది రోజుల వ్యవధిలోనే మా మార్కెట్ విలువ 100 బిలియన్ డాలర్లు పైగా పడిపోయింది. ఇదేదో ఫండమెంటల్స్ మారడం వల్లో లేక వాస్తవ పరిస్థితుల వల్లో జరిగినది కాదు. కేవలం ఒక తప్పుడు కథనాన్ని ఆయుధంగా మార్చుకోవడం వల్ల జరిగినది. నేటి ప్రపంచంలో నిజాన్ని గట్టిగా అరిచి చెప్పాలని ఈ అనుభవం నాకు నేరి్పంది. ఎందుకంటే మనం మౌనం వహిస్తే, మన తలరాతను ఇతరులు రాసేందుకు అస్కారం ఇచి్చనట్లవుతుంది‘అని ఆయన పేర్కొన్నారు. టాప్‌గన్, ఇండిపెండెన్స్ డే, బ్లాక్ హాక్ డౌన్‌లాంటి అమెరికన్ సినిమాలు కేవలం చిత్రాలే కాదని, శక్తి సామర్థ్యాల ప్రదర్శన కూడా అని అదానీ చెప్పారు. రాబోయే రోజుల్లో సినిమా భవిష్యత్తును కృత్రిమ మేథ సరికొత్తగా తీర్చిదిద్దుతుందని ఆయన తెలిపారు. ఈ సాధనాలను ఉపయోగించుకుని భారత గాథను ప్రామాణికంగా ప్రపంచానికి చాటి చెప్పాలని యువ క్రియేటర్లకు సూచించారు.