
ఐశ్వర్యారాయ్ బచ్చన్.. సినిమాలు చూసే సామాన్యులకు కూడా ఈ పేరు తెలుసు. ఎంటర్‌టైన్మెంట్ ప్రపంచంలో మంచి పేరున్న తారల్లో ఒకరు. ఏ సినిమాలోనైనా ఆమె కొన్ని క్షణాలు కనిపించినా చాలు అని అభిమానులు ఆశిస్తారు. ఆకట్టుకునే అందం, అద్భుతమైన నటనతో విశేష కీర్తిని సంపాదించడమే కాదు.. చేతినిండా బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లతో బిజినెస్‌లోనూ రాణిస్తూ భారీ సంపదనూ నిర్మించుకున్నారు.
భారీ నెట్‌వర్త్
భారత సినీ ప్రపంచంలో టాప్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఐశ్వర్య రాయ్ బచ్చన్.. సంపదలోనూ అగ్ర స్థానంలో నిలిచారు. సియాసత్ నివేదిక ప్రకారం.. మే 2025 నాటికి ఐశ్వర్య రాయ్ బచ్చన్ రూ .900 కోట్ల నెట్‌వర్త్‌తో భారతదేశంలో రెండవ ధనవంతురాలైన నటి. మిస్ వరల్డ్ కిరీటాన్నిసాధించడమే కాకుండా పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న ఆమె బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే తారల్లో ఒకరు. న్యూస్ 18 ప్రకారం.. ఆమె ఒక్కో సినిమాకు దాదాపు రూ.10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుందని సమాచారం. నటనతో పాటు హైఎండ్ ఇండియన్, ఇంటర్నేషనల్ బ్రాండ్లను ప్రమోట్ చేయడం ద్వారా రూ.6-7 కోట్లు సంపాదిస్తోంది.
బిజినెస్ వెంచర్లు, విలాసవంతమైన ఆస్తులు
నటన, బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ తో పాటు వ్యాపార ప్రపంచంలోకి కూడా ఐష్ అడుగు పెట్టింది. స్మార్ట్ పెట్టుబడుల కారణంగా ఆమెను బాలీవుడ్ అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తలలో ఒకరిగా పరిగణిస్తున్నారు. పాసిబుల్, యాంబీ వంటి స్టార్టప్‌లలో ఆమె పెట్టుబడులు పెట్టారు.
రియల్ ఎస్టేట్ విషయానికొస్తే ఆమెకు పలు విలాసవంతమైన ఆస్తులు ఉన్నాయి. ప్రస్తుతం ఆమె ముంబైలోని బాంద్రాలో రూ.50 కోట్లకు పైగా విలువ చేసే భారీ బంగ్లాలో నివసిస్తున్నారు. దుబాయ్ లోని జుమేరా గోల్ఫ్ ఎస్టేట్స్ లోని ఎత్తైన శాంక్చురీ ఫాల్స్ లో అద్భుతమైన విల్లా ఉంది.
ఇది చదివారా? ఒక్క ఏడాదిలో రూ.8,500 కోట్లు తీసుకొచ్చా: వివేక్ ఒబెరాయ్
