సైబర్ నేరాలను నియంత్రించాలి
కొత్తగూడెంటౌన్: ప్రజలు సైబర్ నేరాల బారినపడి మోసపోకుండా కాపాడటమే పోలీసుల ప్రధాన లక్ష్యమని ఎస్పీ రోహిత్‌రాజు అన్నారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ‘ఫ్రాడ్ కా పుల్‌స్టాప్‌తో సైబర్ నేరాల నియంత్రణ’ పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు, సైబర్ నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు, పోలీసు అధికారులతో ఫ్రాడ్ కా ఫుల్‌స్టాప్ పేరుతో 42 రోజులపాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ ఆశోక్, ఇన్‌స్పెక్టర్లు జితేందర్, సీహెచ్ శ్రీనివాస్, ఇ,శ్రీనివాస్, రాము, ఆర్‌ఐ కృష్ణారావు, ఎస్సైలు రాజమౌళి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ రోహిత్‌రాజు


