ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి
కొత్తగూడెంటౌన్: దివ్యాంగులకు అంగవైకల్యం అడ్డుకాకూడదని, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.రాజేందర్ అన్నారు. బుధవారం కొత్తగూడెం బాబుక్యాంప్‌లోని భవిత సెంటర్‌లో దివ్యాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగవైకల్యాన్ని జయించి చాలా మంది దివ్యాంగులు విజేతలుగా నిలిచారని అన్నారు. అనంతరం దివ్యాంగ పిల్లలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఈఓ నాగలక్ష్మి, అధికారులు ఎస్‌కే సైదులు, నాగరాజశేఖర్, సతీష్, బాలాజీ, సిద్దయ్య, సంతోష్, హెచ్‌ఎం నాగలక్ష్మి పాల్గొన్నారు.


