రెండో విడతలో భారీగా నామినేషన్లు
రెండో విడతలో నామినేషన్ల సంఖ్య
చుంచుపల్లి: ఈ నెల 14న రెండో విడత ఎన్నికలు జరగనున్న 7 మండలాల్లో 155 గ్రామ పంచాయతీలు, 1,384 వార్డులకు నామినేషన్ల స్వీకరణ మంగళవారంతో ముగిసింది. చివరి రోజు నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు అధిక సంఖ్యలో కేంద్రాలకు తరలివచ్చారు. నామినేషన్ కేంద్రాలు సందడిగా మారాయి. అర్ధరాత్రి వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగింది. అభ్యంతరాల స్వీకరణ, ఉపసంహరణల అనంతరం ఈ నెల 6న బరిలో నిలిచే అభ్యర్థులను ప్రకటిస్తారు. ఏడు మండలాల పరిధిలో 4,263 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో సర్పంచ్ స్థానాలకు 798 మంది, వార్డు స్థానాలకు 3,465 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. ఒక గ్రామ పంచాయతీకి, 13 వార్డులకు వివిధ కారణాలతో నామినేషన్లు దాఖలు కాలేదు. పాల్వంచ మండలంలో అత్యధికంగా 814 నామినేషన్లు దాఖలు కాగా, అత్యల్పంగా అన్నపురెడ్డిపల్లి మండలంలో 316 మాత్రమే నమోదయ్యాయి.
జిల్లాలో 4,263 సెట్లు దాఖలు
మండలం సర్పంచ్‌లు వార్డులు మొత్తం
అన్నపురెడ్డిపల్లి 43 273 316
అశ్వారావుపేట 145 529 674
చండ్రుగొండ 74 388 462
చుంచుపల్లి 101 503 604
దమ్మపేట 152 658 810
ములకలపల్లి 114 469 583
పాల్వంచ 169 645 814


