నోటాకు 15 ఏళ్లు | - | Sakshi
Sakshi News home page

నోటాకు 15 ఏళ్లు

Dec 4 2025 7:18 AM | Updated on Dec 4 2025 7:18 AM

నోటాక

నోటాకు 15 ఏళ్లు

సుజాతనగర్‌: ఎన్నికల్లో అభ్యర్థులు నచ్చనపుడు తెరపైకి వచ్చిన ఆప్షనే నోటా (నన్‌ ఆఫ్‌ ది ఎబో). పోటీలో ఉన్న అభ్యర్థులెవరూ నచ్చకపోతే ఆ అభిప్రాయాన్ని వ్యక్తీకరించే అవకాశం నోటా కల్పిస్తుంది. 2013 వరకు ఓటర్లకు అభ్యర్థులు నచ్చకపోయినా.. సరైన అభ్యర్థి పోటీలో లేరని భావించినా ఎవరికో ఒకరికి ఓటేయాల్సిన పరిస్థితి ఉండేది. అదే ఏడాది సెప్టెంబర్‌ 27న దేశ అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పుతో నోటా అమల్లోకి వచ్చింది. ఎన్నికల సంఘం ఈవీఎంలలో నోటా బటన్‌ అమర్చాక మొదటిసారి ఢిల్లీ, రాజస్థాన్‌, మిజోరాం, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో నోటాకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో నోటా ఉంటోంది. రాష్ట్ర పంచాయతీరాజ్‌ సంస్థలు ఎన్నికల నిర్వహణ నియమావళిలో కూడా దీనిని పొందుపరిచారు. దీనిననుసరించి ప్రస్తుతం బ్యాలెట్‌ విధానంలో జరిగే పంచాయతీ ఎన్నికల్లోనూ బ్యాలెట్‌ పత్రంలో చివర నోటా పెట్టారు.

సమాన అవకాశాలు

పొందాలి

కొత్తగూడెంఅర్బన్‌: దివ్యాంగ పిల్లలు కూడా అందరితో సమాన అవకాశాలు పొందాలని ట్రెయినీ కలెక్టర్‌ సౌరభ్‌శర్మ తెలిపారు. బుధవారం కొత్తగూడెం భవిత సెంటర్‌లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు. ట్రెయినీ కలెక్టర్‌ హాజరై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జరిగిన ఆటల పోటీల్లో విజేతలకుబహుమతులు అందజేసి మాట్లాడారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు లభించేలా ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. పిల్లలు చూపుతున్న ప్రతిభ, పట్టుదల, మనోబలం ప్రతి కుటుంబానికీ, సమాజానికీ ప్రేరణ కావాలని సూచించారు. అనంతరం డీఈఓ నాగలక్ష్మి మాట్లాడుతూ.. దివ్యాంగుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సదుపాయాల గురించి వివరించారు. అనంతరం జిల్లా సమ్మిలిత విద్యా కోఆర్డినేటర్‌ ఎస్కే సైదులు మాట్లాడారు. కార్యక్రమంలో ఎ.నాగరాజశేఖర్‌, ఎన్‌.సతీశ్‌కుమార్‌, ఎంఈఓ మధురవాణి, కాంప్లెక్స్‌ హెచ్‌ఎం సుబ్బారావు, భవిత కేంద్రం సిబ్బంది శ్రీరామ్‌, అరుణకుమారి పాల్గొన్నారు.

వ్యాపారికి

మరోసారి నోటీసులు

భద్రాచలంటౌన్‌: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానం అధికారులు వస్త్రాలు విక్రయించే వ్యాపారికి రెండో సారి బుధవారం నోటీసులు జారీ చేశారు. వారం రోజుల క్రితం బార్‌ కోడ్‌ లేకుండా భక్తులకు పంచెలు, చీరలు, కండువాలు విక్రయిస్తూ పట్టుబడాడు. నిబంధనలకు విరుద్ధంగా వస్త్రాలను విక్రయిస్తున్న వ్యాపారికి అధికారులు నోటీసులు జారీ చేశారు. కాగా, మళ్లీ మంగళవారం కూడా బార్‌ కోడ్‌ లేకుండా వ్యాపారి విక్రయిస్తున్న వస్త్రాలు కౌంటర్‌లో దొరికాయి. ఈ ఘటనలపై పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ ఈఓ దామోద్‌రావు బుధవారం మరో సారి నోటీసులు జారీ చేశారు.

ఐహెచ్‌ఐపీ పోర్టల్‌

వినియోగంపె శిక్షణ

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాలులో బుధవారం ఐహెచ్‌ఐపీ పోర్టల్‌ వినియోగంపై ప్రైవేట్‌ ఆస్పత్రులు, డయాగ్నొస్టిక్‌ సెంటర్ల సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. డీఎంహెచ్‌ఓ తుకారాంరాథోడ్‌ మాట్లాడుతూ.. పోర్టల్‌లో సిండ్రామిక్‌ సర్వేలైన్స్‌కు సంబంధించిన 22 సిండ్రోములు, 33 వ్యాధుల వివరాలను ప్రతిరోజు తప్పకుండా నమోదు చేయా లని సూచించారు. క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌, పీసీపీఎన్‌డీటీ యాక్ట్‌, ఎంటీపీ యాక్ట్‌ అమలు విధానాలపై వివరించారు. జిల్లాలో శస్త్రచికిత్సల శాతం తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ జయలక్ష్మి, ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ పుల్లారెడ్డితోపాటు ఇమాన్యుయల్‌, శ్రీనివాస్‌, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్ర ధాన్యం లారీ సీజ్‌

మధిర: ఏపీ నుంచి తెలంగాణలోకి అక్రమంగా ప్రవేశించిన ధాన్యం లారీని సీజ్‌ చేసినట్లు మధిర టౌన్‌ సీఐ రమేశ్‌ బుధవారం తెలిపారు. మండలంలోని దేశనేని పాలెం వ్యవసాయ చెక్‌పోస్ట్‌ వద్ద వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులు తనిఖీలు చేస్తున్న క్రమంలో ఈ లారీ పట్టుబడినట్లు తెలిపారు. రాష్ట్రంలో సన్న వడ్లకు ప్రభుత్వం రూ.500 బోనస్‌ ఇస్తున్న క్రమంలో ఆంధ్ర నుంచి ధాన్యం లారీ అక్రమ అనుమతులతో రాష్ట్రంలోకి ప్రవేశించిందని ఆయన వివరించారు.

నోటాకు 15 ఏళ్లు1
1/1

నోటాకు 15 ఏళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement