108 ఉద్యోగులకు శిక్షణ తరగతులు
ఖమ్మంవైద్యవిభాగం: ఉమ్మడి ఖమ్మంతో పాటు మహబూబాబాద్ జిల్లాలోని 108 వాహనాల్లో పనిచేస్తున్న ఈఎంటీ, డ్రైవర్ల (పైలట్లు)కు మంగళవారం ఖమ్మం జనరల్ ఆస్పత్రిలో శిక్షణ ఇచ్చారు. హైదరాబాద్ గ్రీన్‌హెల్త్ సర్వీస్‌కు చెందిన పార్వతమ్మ సాధారణ, కష్టంతరమైన ప్రసవాలు చేయడంపై ఈఎంటీలకు అవగాహన కల్పించారు. అలాగే, పైలట్లకు డ్రైవింగ్‌లో మెళకువలు, క్షతగాత్రుల తరలింపు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. 108 జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ పాటి శివకుమార్, జిల్లా ఎమర్జెన్సీ మేనేజర్ అవులూరి దుర్గాప్రసాద్, మహబూబాబాద్, భద్రాద్రి జిల్లాల ఉద్యోగులు మహేశ్, సతీశ్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.


