ముఖ్యమంత్రికి మాజీ ఎమ్మెల్యే వినతి
సూపర్‌బజార్(కొత్తగూడెం): ముఖ్యమంత్రి జిల్లా పర్యటన సందర్భంగా పలువురు పలు సమస్యలపై వినతిపత్రాలు అందించడానికి సిద్ధం చేసుకున్నప్పటికీ ఒక్కరికే ఆ అవకాశం దక్కడం విశేషం. ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాస్‌లైన్ ఆధ్వర్యంలో హెలీప్యాడ్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వినతిపత్రం అందించారు. మీడియాకు కూడా అక్కడ అనుమతి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. సీతారామ ప్రాజెక్ట్‌ను 2005లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో రాజీవ్‌సాగర్ పేరుతో మొదలు పెట్టారని, రీడిజైన్ కంటే ముందు ఉన్న డిజైన్ ప్రకారం నిర్మించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.
జీపీ కార్యదర్శులకు దేహశుద్ధి
దుమ్ముగూడెం: మండలంలోని ఇద్దరు పంచాయతీ కార్యదర్శులకు లక్ష్మీనగరం గ్రామస్తులు దేహశుద్ధి చేసిన ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామంలోని ఓ వివాహితతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఇద్దరు పంచాయతీ కార్యదర్శులకు గ్రామస్తులు, కుటుంబ సభ్యులు దేహశుద్ధి చేశారు. అనంతరం విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పంచాయతీ కార్యదర్శులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
కారు డోరుకు బైక్ ఢీ..
● యువకుడు మృతి
పాల్వంచరూరల్: ఆగి ఉన్న కారు డోరు తెరిచిఉండగా.. దానికి బైక్ ఢీకొని ఓ యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన మంగళవారం మండలంలోని జగన్నాథపురం శివారులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బూర్గంపాడు మండలం మోరంపల్లిబంజర గ్రామానికి చెందిన, బీపీఎల్‌లో పనిచేస్తున్న సంగు రాఘవేంద్రారెడ్డి (24), అతని బంధువు ఆవుల మహేశ్వర్‌రెడ్డి కలిసి బైక్‌పై పాల్వంచ నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. జగన్నాథపురం శివారులో కారు ఆగి ఉండగా.. డ్రైవర్ డోరు తెరిచి ఉంచాడు. ఆ డోరుకు బైక్ ఢీకొని రాఘవేంద్రారెడ్డి కిందపడి.. అక్కడికక్కడే మృతిచెందాడు. మహేశ్వర్‌రెడ్డికి స్వల్పగాయాలయ్యాయి. మృతుడి భావ ఆర్.పుల్లారెడ్డి ఫిర్యాదు మేరకు కారుడ్రైవర్, సారపాకకు చెందిన సోము రాఘునాథ్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్ కృష్ణ తెలిపారు.
జింకలకు ఉచ్చు వేసిన ఐదుగురు అరెస్ట్
పాల్వంచరూరల్: కిన్నెరసాని డీర్ పార్కులోని జింకలను చంపేందుకు విద్యుత్ తీగలతో ఉచ్చు వేసిన ఐదుగురిని వైల్డ్‌లైఫ్ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. మండలంలోని యానంబైల్ రేంజ్ పరిధి కిన్నెరసాని డీర్ పార్కు శివారులో సోమవారం రాత్రి విద్యుత్ ఉచ్చులు వేసినట్లు సమాచారం అందుకున్న వైల్డ్‌లైఫ్ సిబ్బంది బి.కిషన్, నగేశ్, వాచర్స్ కల్యాణ్, ఇబ్రహీం ఘటనా ప్రదేశానికి వెళ్లారు. ఉచ్చులు వేసిన, రాజాపురం గ్రామానికి చెందిన గుమ్మడి వెంకటేశ్వర్లు, కల్తీ శ్రావంత్, పడిగే శ్రీను, కల్తీ నర్సింహారావు, యానంబైల్ గ్రామానికి చెందిన గుమ్మడి నాగేశ్వరరావును పట్టుకుని విద్యుత్ ఉచ్చును స్వాధీనం చేసుకున్నారు.
బస్సు ఢీకొని ఒకరు మృతి
ఖమ్మంరూరల్: ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టగా డ్రైవర్ మృతి చెందిన ఘటన ఏదులాపురం మున్సిపాలిటీ పరిఽధి గొల్లగూడెం వద్ద మంగళవారం రాత్రి జరిగింది. ఆటోడ్రైవర్ కుక్కల మధు(36) ఖమ్మం వైపు వెళ్లుండగా గొల్లగూడెం వద్ద ఎదురుగా వచ్చిన బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రగాయాలైన ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మధుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా, పోలీసులు ఇచ్చిన సమాచారంతో అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు తన బృందంతో చేరుకుని మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు.
ముఖ్యమంత్రికి మాజీ ఎమ్మెల్యే వినతి
ముఖ్యమంత్రికి మాజీ ఎమ్మెల్యే వినతి
ముఖ్యమంత్రికి మాజీ ఎమ్మెల్యే వినతి


