వారు వెళ్లారు.. వీరు వచ్చారు..
కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ప్రాంగణంలోనే బహిరంగ సభ ఏర్పాటు చేయగా జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల నుంచి డ్వాక్రా మహిళలను ఆర్టీసీ బస్సుల ద్వారా ఉదయం 10 గంటల వరకే తీసుకొచ్చారు. వీరికి భోజనం, తాగునీటి సౌకర్యం లేకపోవడంతో మధ్యాహ్నం 12 గంటల తర్వాత వెనుదిరగడం ప్రారంభించారు. ఇక 2.30 గంటలకు రావాల్సిన ముఖ్యమంత్రి.. సాంకేతిక కారణాలతో సాయంత్రం 5 గంటలకు చేరుకున్నారు. దీంతో పాల్వంచ కేజీబీవీ, ఆశ్రమ పాఠశాలలు, సింగరేణి హై స్కూల్, మేదరబస్తీ పాఠశాల నుంచి దాదాపు 1000 మంది విద్యార్థులను బహిరంగ సభకు తీసుకొచ్చారు. వీరితో పాటు యూనివర్సిటీ విద్యార్థులు కూడా ఉండడంతో సభా ప్రాంగణం కళకళలాడింది. – కొత్తగూడెంఅర్బన్/సూపర్‌బజార్
(కొత్తగూడెం)/స్టాఫ్ ఫొటోగ్రాఫర్
వారు వెళ్లారు.. వీరు వచ్చారు..


