పోటీకి సై.. పైసలు నై | - | Sakshi
Sakshi News home page

పోటీకి సై.. పైసలు నై

Dec 1 2025 8:45 AM | Updated on Dec 1 2025 8:45 AM

పోటీకి సై.. పైసలు నై

పోటీకి సై.. పైసలు నై

● పంచాయతీ ఎన్నికల్లో ఖర్చుకు ఆశావహుల్లో జంకు ● గతం నేర్పిన పాఠంతో తర్జనభర్జన ● పలు చోట్ల అన్ని పార్టీలకూ అభ్యర్థుల కొరత

భారీగానే ఖర్చు..

● పంచాయతీ ఎన్నికల్లో ఖర్చుకు ఆశావహుల్లో జంకు ● గతం నేర్పిన పాఠంతో తర్జనభర్జన ● పలు చోట్ల అన్ని పార్టీలకూ అభ్యర్థుల కొరత

బూర్గంపాడు/ఇల్లెందురూరల్‌: సర్పంచ్‌ పదవిపై ఆశలు పెట్టుకున్న స్థానిక నాయకులు పోరులో నిలిచేందుకు ఉత్సాహ పడుతున్నా.. మరోవైపు ఎన్నికల ఖర్చు, గతానుభవాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఖర్చు ఎలా భరించాలని తర్జనభర్జన పడుతున్నారు. అభ్యర్థుల ఎన్నికల ఖర్చు విషయంలో నిబంధనలు వేర్వేరుగా ఉన్నాయి. 5 వేల కంటే అధికంగా జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచ్‌ అభ్యర్థులు రూ.2.50 లక్షల వరకు, 5 వేల కంటే తక్కువ జనాభా కలిగి ఉన్న గ్రామాల్లో రూ.1.50 లక్షల వర కు ఖర్చు పెట్టవచ్చు. వార్డు సభ్యులైతే 5 వేల జనా భా కంటే అధికంగా ఉన్న వార్డుల్లో రూ.50 వేలు, అంతకంటే తక్కువ ఉన్న వార్డుల్లో రూ.30వేలు ఖర్చు చేసుకోవచ్చని ఎన్నికల సంఘం పేర్కొంది.

గతం నేర్పిన పాఠంతో..

స్వరాష్ట్రంలో మొదటి దఫా సర్పంచ్‌గా ఎన్నికై న నేతలు ప్రారంభంలో సంతోషంగా పాలన సాగించారు. వార్డు సభ్యులు, అధికారులు కలిసి రావడం, ప్రభుత్వం నుంచి నిధులు క్రమం తప్పకుండా మంజూరు కావడం.. వెరసి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ కాలర్‌ ఎగురవేశారు. కాలం గడిచే కొద్ది సర్పంచ్‌ పదవి ముళ్లకిరీటంగా మారింది. ప్రభుత్వం నుంచి నిధులు ఎప్పటిలాగా మంజూరవుతాయని భావించి పల్లె పాలన కోసం పలువురు సర్పంచ్‌లు అప్పులు చేశారు. నిధుల మంజూరు గాడి తప్పడంతో చేసిన అప్పులు భారంగా మారాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పలువురు సర్పంచ్‌లు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. పదవీ కాలం గడువు దగ్గర పడుతున్న కొద్దీ పాలన కష్టంగా మారి కొందరు ప్రజల చేత చీత్కారాలకు కూడా గురయ్యారు. చివరకు అప్పుల భారం మెడలో వేసుకుని పదవీ బాధ్యతల నుంచి దిగిపోయారు. మరోసారి స్థానిక సమరం జరుగుతున్నా గత అనుభవాల దృష్ట్యా తాజా ఎన్నికల్లో ఆశావహులు జంకుతున్నారు. ఈ కారణంగానే ఎన్నికల వేళ పలు గ్రామపంచాయతీల్లో అధికార, ప్రతిపక్షాల సహా అన్ని పార్టీలూ అభ్యర్థులను వెతుక్కోక తప్పని పరిస్థితి నెలకొంది.

ఇళ్లు, భూములు తనఖా

ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు కొందరు ఖర్చుల కోసం అప్పులు చేస్తున్నారు. సర్పంచ్‌ పీఠంపై ఆశతో ఇళ్లు, భూములు తనఖా పెడుతున్నారు. శనివారం మొదటి విడత నామినేషన్ల ఘట్టం ముగియటంతో ప్రచారపర్వం మొదలుపెట్టారు. సుమారు 10 రోజుల పాటు ప్రచారంలో తిరిగే కేడర్‌కు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. రాజకీయ పార్టీల నుంచి, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి ఆయా నియోజకవర్గాల్లోని సర్పంచ్‌ అభ్యర్థులకు ఎలాంటి ఆర్థిక భరోసా ఇవ్వటం లేదు. మరోవైపు ఎన్నికల సంఘం విఽధించిన పరిమితికి అనాధికారికంగా ఐదారు రెట్లు ఎక్కువ ఖర్చయ్యే పరిస్థితి ఉందని పలువురు అభ్యర్థులు వాపోతున్నారు.

ఇల్లెందు మండలంలో 29 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఇందులో 274 వార్డులు ఉండగా, బరిలో ఉండే సర్పంచ్‌లు, వార్డు సభ్యులు 46,894 మంది ఓటర్లను ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో రూ.కోట్లు ఖర్చు రాగా.. ప్రస్తుతం చిన్న గ్రామపంచాయితీలో కనీసం రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు, పెద్ద గ్రామపంచాయతీల్లో రూ.5లక్షల నుంచి 10 లక్షల వరకు, పోటీ అధికంగా ఉంటే రూ.15 లక్షల వరకు ఖర్చు రావొచ్చని అంచనా వేస్తున్నారు. నామినేషన్‌ రోజు నుంచి పోలింగ్‌ రోజువరకు దాదాపు 15 రోజుల వ్యవధి ఉంది. ఈ క్రమంలో ప్రచారం కోసం కార్యకర్తలు వెంట తిరగడం, వారికి టీ, టిఫిన్‌, భోజనంతోపాటు మద్యం కోసం అధికంగా ఖర్చు కానుంది. పోలి ంగ్‌ ముందు రోజు ఈ ఖర్చు రెట్టింపు అవుతుందని నాయకులు బాహాటంగానే చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement