
నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలి
పాల్వంచ: విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని టీజీ ఎన్‌పీడీసీఎల్ డైరెక్టర్(ఆపరేషన్స్) టి.మధుసూదన్ అన్నారు. శనివారం జెన్‌కో ట్రైనింగ్ సెంటర్‌లో విద్యుత్ సరఫరా అంతరాయాలపై జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించిన సమావేశం నిర్వహించారు. నూతనంగా నిర్మాణం చేపడుతున్న విద్యుత్ నియంత్రికలు, విద్యుత్ లైన్లు, సబ్ స్టేషన్‌లు, విద్యుత్ ప్రమాదాల నివారణ, విద్యుత్ ప్రమాదాలపై అవగాహన తదితర అంశాలపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యుత్ సిబ్బంది పూర్తి రక్షణ పరికరాలు వాడాలని చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని ఆదేశించారు. అనంతరం డైరెక్టర్‌ను అధికారులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ రాజు చౌహాన్, జిల్లా సూపరింటెండెంట్ మహేందర్, డీఈలు, ఏడీఈలు, అకౌంట్స్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.