
ఇద్దరు దొంగల పట్టివేత
భద్రాచలంఅర్బన్: భద్రాచలం పట్టణంలోని గోదావరి కరకట్ట ప్రాంతంలో శనివారం సాయంత్రం రూ.లక్ష విలువ గల సామగ్రి ఉన్న బ్యాగును అపహరిస్తున్న ఇద్దరు వ్యక్తులను స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వివరాలిలా.. కరకట్ట ప్రాంతంలో ఫొటోలు తీసేందుకు అవసరమైన కెమెరా ఇతర సామగ్రి ఉన్న ఒక బ్యాగును ఇద్దరు వ్యక్తులు అపహరించే ప్రయత్నం చేయగా స్థానికులు పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో బ్లూకోట్ టీం అక్కడకు చేరుకొని వారిని స్టేషన్‌కు తరలించి విచారించగా.. పాల్పంచ పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన చలపతి, ఉపేంద్రగా తెలిసింది.