
బీఏఎస్‌కు విద్యార్థుల ఎంపిక
భద్రాచలం: గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యాన ఖమ్మం జిల్లాలోని బెస్ట్ అవైలబుల్ పాఠశాల (బీఏఎస్)ల్లో ఐదో తరగతిలో ప్రవేశానికి గత నెల 20వ తేదీన లక్కీ డ్రా ద్వారా విద్యార్థినులను ఎంపిక చేయగా పలువురు చేరలేదు. దీంతో కొత్త వారి ఎంపికకు భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో శనివారం గిరిజన సంక్షేమ శాఖ ఖమ్మం డీడీ విజయలక్ష్మి ఆధ్వర్యాన డ్రా తీశారు. అధికారులు హరీశ్, అశోక్‌కుమార్, నారాయణరెడ్డి, రాములు, రాంబాబు, రాజేందర్, నర్సింహారావు, శ్రీనివాసరావు, ధనుష్ తదితరులు పాల్గొన్నారు.
మహిళలు ఎదగాలి
కొత్తగూడెంఅర్బన్: మహిళల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతోందని ట్రెయినీ కలెక్టర్ సౌరబ్‌శర్మ అన్నారు. శనివారం కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన ఆర్‌పీల సమావేశంలో ఆయన మాట్లాడారు. మెప్మా డీఎంసీ, ఏడీఎంసీ, టీఎంసీ బి.వెంకటేశ్వర్లు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు శాంతకుమార్, మౌలాల్, సరిత, ఆర్పీలు పాల్గొన్నారు.
కేన్సర్ బాధితురాలికి ఆర్థిక చేయూత
కొత్తగూడెంటౌన్: కొత్తగూడెంకు చెందిన సింధు కేన్సర్‌తో బాధపడుతుండగా చికిత్సకు వసుధ ఫౌండేషన్ బాధ్యులు చేయూతనిచ్చారు. కొత్తగూడెంలో శనివారం ఎస్పీ రోహిత్‌రాజు చేతుల మీదుగా రూ.10 వేల చెక్కు అందజేశారు. ఫౌండేషన్ కన్వీనర్ విగేశ్న శ్రీనివాసరాజు, రమేష్ పాల్గొన్నారు.
జయప్రదం చేయండి
సింగరేణి(కొత్తగూడెం): ఈనెల 9న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం (జీఎల్‌బీకేఎస్) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఐ.కృష్ణ పిలుపునిచ్చారు. శనివారం కొత్తగూడెంలోని రైటర్ బస్తిలో జరిగిన విప్లవ కార్మిక సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమ్మె విజయవంతం ద్వారా కేంద్రానికి కనువిప్పు కలిగించాలని కోరారు. నాయకులు గౌనీ నాగేశ్వరరావు, ఎన్. సంజీవ్, మ ల్లీఖార్జన్‌రావు, శ్రీను, కృష్ణ, శరత్, రామకృష్ణ, రాజేష్, కిరణ్ కుమార్ పాల్గొన్నారు.
10న తెలంగాణ జాగృతి సమావేశం
సూపర్‌బజార్(కొత్తగూడెం): తెలంగాణ జాగృతి జిల్లా స్థాయి విస్తృత స్థాయి సమావేశాన్ని కొత్తగూడెం క్లబ్‌లో ఈనెల 10న నిర్వంహించనున్నారు. ఈ సందర్భంగా కొత్తగూడెంలో శనివారం జరిగిన సన్నాహాక సమావేశంలో జాగృతి రాష్ట్ర నాయకుడు రూప్‌సింగ్, సదానందంగౌడ్, మహిళా అధ్యక్షురాలు మాధవి మాట్లాడారు. ఈనెల 10న జరిగే సమావేశానికి తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరుకానుండగా, సీఐటీయూ పట్టణ కార్యదర్శి వీరన్న నేతృత్వంలో పలువురు జాగృతిలో చేరనున్నారని తెలిపారు. జిల్లా కన్వీనర్ పవన్‌నాయక్, నాయకులు సింధుతపస్వి, బత్తుల వీరయ్య, ఎం.డీ.హుస్సేన్, నవతన్, కిరణ్‌కుమార్, వరప్రసాద్, సాదిక్‌పాషా పాల్గొన్నారు.