
అక్రమ కలప రవాణాపై ముమ్మర తనిఖీ..
ఇల్లెందురూరల్: మండలలోని ఇల్లెందు రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతంలో గత వారం రోజులు గా బొజ్జాయిగూడెం, కొత్తూరు పరిసర ప్రాంతాల నుంచి అక్రమంగా టేకు కలప తరలిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు రెండు రోజులుగా గాలింపు చర్యలు ముమ్మరం చేసి ఇప్పటివరకు రూ.2.70 లక్షలు విలువ చేసే 124 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అధికారులు మరింత లోతుగా విచారణ నిర్వహిస్తే కలప అక్రమ తరలింపులో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ విషయమై ఇల్లెందు రేంజ్ ఇన్‌చార్జ్ ఎఫ్‌ఆర్‌ఓ చలపతిరావును వివరణ కోరగా.. టేకు కలప అక్రమంగా తరలిపోయినట్లు నిర్థారించుకుని తనిఖీలు ప్రారంభించాం. ఇంకా తనిఖీలు కొనసాగించి అనుమానితులపై విచారణ కొనసాగిస్తాం.
ఇప్పటివరకు రూ.2.70 లక్షల
టేకు దుంగలు స్వాధీనం