
ఎస్సైకు గోల్డ్ మెడల్
భద్రాచలంఅర్బన్: జోనల్ డ్యూటీ మీట్‌లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మూడు రోజుల పాటు నిర్వహించిన భద్రాద్రి జోనల్ డ్యూటీ మీట్ ఈనెల 4న ముగిసింది. జోనల్ పరిధిలో వరంగల్, ఖమ్మం పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని వరంగల్, మహబుబూబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులు పలు విభాగాల్లో పోటీపడ్డారు. ఇందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 19 మెడల్స్ రాగా వీరిలో భద్రాచలం టౌన్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న గంజి స్వప్నకు రెండు విభాగాలలో గోల్డ్ మెడల్ సాధించింది.