
రామాలయంలో సెక్యూరిటీ పటిష్టం
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో సెక్యూరిటీ వ్యవస్థను మరింత పటిష్టం చేశారు. రెండు డోర్ ఫ్రేమ్‌లను, మెటల్ డిటెక్టర్, ఆరు హ్యాండ్ హోల్డ్ మెటల్ డిటెక్టర్లను కొనుగోలు చేసి శుక్రవారం ఆలయంలో అమర్చారు. ఎస్పీఎఫ్ సిబ్బంది భక్తులను తనిఖీ చేసి అనుమతించారు. ఈఈ రవీందర్ పర్యవేక్షించారు.
వస్త్ర దుకాణ టెండర్‌దారుడికి రూ.లక్ష జరిమానా
అన్యమత ప్రచారం చేసే కవర్లను దేవస్థానంలో వినియోగించినందుకు దేవస్థానం అఽధికారులు వస్త్ర దుకాణ టెండర్‌దారుడికి రూ.లక్ష జరిమానా విధించారు. నెల రోజుల క్రితం ఆంధ్రాకు చెందిన ఓ భక్త జంట స్వామివారి వస్త్రాలను ఆలయ ప్రాంగణంలో కొనుగోలు చేయగా, వాటిని ఆ దుకాణ దారుడు ఓ కవర్‌లో పెట్టి ఇచ్చారు. పరిశీలించగా కవరుపై అన్యమత ప్రచారం ఉంది. ఆ దంపతులు ఈఓకు ఫిర్యాదు చేయగా, ఏఈవో శ్రవణ్‌కుమార్‌ను విచారణకు ఆదేశించారు. ఆయన విచారించి ఇచ్చిన నివేదిక ఆధారంగా, దేవాదాయ శాఖ నిబంధనలను అతిక్రమించి అన్యమతం ప్రచారం చేసినందుకు ఈఓ రూ.లక్ష జరిమానా విధించారు.
మెటల్ డిటెక్టర్ల ఏర్పాటు