
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితరపూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, మంగళవారాన్ని పురస్కరించుకుని అభయాంజనేయస్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు.
ఘనంగా వనమహోత్సవం
శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో కార్యాలయ ఆవరణలో మంగళవారం వనమహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈఓ ఎల్.రమాదేవి మొక్క నాటి నీరు పోశారు. కార్యక్రమంలో ఏఈఓలు భవానీ రామకృష్ణ, శ్రావణ్‌కుమార్, ఈఈ రవీంద్రనాథ్, సీసీ శ్రీనివాసరెడ్డి, సూపరింటెండెంట్ కత్తి శ్రీనివాస్ పాల్గొన్నారు.
‘సాహిత్య సూచి’లో
జిల్లా వాసికి అవకాశం
అశ్వారావుపేటరూరల్: తెలంగాణ సాహిత్య అకాడమీ రూపొందించిన సాహిత్య గ్రంథ సూచిలో అశ్వారావుపేటకు చెందిన ప్రముఖ రచయిత సిద్ధాంతపు ప్రభాకరాచార్యులు రాసిన గ్రంథాలకు స్థానం దక్కింది. ఆయన రచించిన కాళికాంబసప్తశతి, రాతిపూలవనం తదితర గ్రంథాల సమగ్ర వివరాలను సూచిలో పొందుపర్చారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ నామోజు బాలాచారి చేతుల మీదుగా ఈ గ్రంథాన్ని ప్రభాకరాచార్యులు అందుకున్నారు.
కార్పొరేషన్
కార్యాలయంలో తనిఖీలు
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని మంగళవారం ట్రైనీ కలెక్టర్ సౌరభ్ శర్మ సందర్శించారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ విభాగంలో రికార్డులను, జరుగుతున్న పనులకు సంబంధించిన నివేదికలను పరిశీలించారు. ప్రస్తుతం ఏ పను లు జరుగుతున్నాయి? ఎలా జరుగుతున్నాయి? అని డీఈ రవికుమార్‌ను అడిగి తెలుసుకున్నారు.

నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం

నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం

నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం