
పట్టణాల్లో లోపించిన పారిశుద్ధ్యం
● వీధుల్లోకి వస్తే భరించరాని దుర్గంధం ● అస్తవ్యస్త డ్రెయినేజీలతో ప్రజల ఇక్కట్లు ● ఇంటింటి చెత్త సేకరణా అంతంతే ● పన్ను వసూళ్లలో మాత్రం ముందుంటున్న అధికారులు
● పేరులోనే మధురం
కొత్తగూడెంఅర్బన్ : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి మధురబస్తీలో పారిశుద్ధ్య సమస్య ప్రజలను పట్టిపీడిస్తోంది. బస్తీమధ్యలో నుంచి ప్రధా న డ్రెయినేజీ ఉండగా స్థానికుల ఇళ్లలో నుంచి కంటే ఎగువ ప్రాంతాల నుంచి మురికి నీరు, చెత్తాచెదారం చేరుతోంది. బస్తీ చివరన ఉన్న కిన్నెరసాని పైపులైన్ ఈ డ్రెయినేజీలో ఉండేది. మున్సిపల్ అధికారులు ఈ పైపులైన్ డమ్మీ చేసి పక్కనే మరో పైపులైన్ ఏర్పాటు చేశారు. అయితే డమ్మి చేసిన పైపులైన్‌ను డ్రెయినేజీనుంచి తొలగించకపోవడంతో మురికి నీరు, సిల్ట్ ముందుకెళ్లడం లేదు. దీంతో దోమలు, ఈగలు విజృంభిస్తున్నాయని బస్తీ వాసులు అంటున్నారు. బయటకు వెళితే డ్రెయినేజీ నుంచి భరించరాని దుర్గంధం వస్తోందని, కనీసం రెండు రోజులకోసారైనా సిల్ట్ తొలగించాలని కోరుతున్నారు.
పైపులైన్‌ను తొలగించాలి
మధురబస్తీ ప్రధాన డ్రెయినేజీలో అడ్డుగా ఉన్న కిన్నెరసాని పైపులైన్ తొలగించాలి. డ్రెయినేజీలో మురికినీరు పోకుండా అడ్డుగా ఉండడంతో వర్షం వస్తే మురుగంతా ఇళ్లలోకే వస్తోంది. దీనిపై మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. – అరుణ్, మధురబస్తీ

పట్టణాల్లో లోపించిన పారిశుద్ధ్యం