
గిరిజనుల సమస్యలు పరిష్కరించాలి
భద్రాచలం : గిరిజన దర్బార్‌లో వినతులు ఇచ్చే వారి సమస్యలు సత్వరమే పరిష్కరించాలని, ఈ విషయంలో ఉద్యోగులు బాధ్యతగా వ్యవహరించాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్‌లో ఆయన వినతులు స్వీకరించి, సంబంధిత అధికారులకు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్‌రాజ్, ఏఓ సున్నం రాంబాబు, గురుకుల ఆర్‌సీఓ అరుణకుమారి, ఎస్‌డీసీ రవీంద్రనాథ్, అధికారులు భాస్కర్, వేణు, లక్ష్మీనారాయణ, రమేష్, ఆదినారాయణ, హరికృష్ణ పాల్గొన్నారు.
స్వచ్ఛంద సంస్థల సేవలు భేష్
దుమ్ముగూడెం : గిరిజనుల ఆరోగ్య పరిరక్షణకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, లయన్స్ క్షబ్ వారి సేవలు అభినందనీయమని పీఓ రాహుల్ అన్నారు. ములకపాడు ఆస్పత్రిలో సోమవారం నిర్వహించిన వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇలాంటి శిబిరాలతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు ఉచితంగా అందుతాయని చెప్పారు. శిబిరం కో ఆర్డినేటర్ డాక్టర్ ఎస్.ఎల్.కాంతారావు మాట్లాడుతూ.. 219 మందికి కంటిచూపు తక్కువగా ఉన్నట్లు గుర్తించామని, అందులో 142 మందిని కేటరాక్ట్ ఆపరేషన్లకు ఎంపిక చేశామని తెలిపారు. కార్యక్రమంలో డీడీఎంహెచ్‌ఓ చైతన్య, వైద్యులు, ఆయా సంస్థల బాధులు సూర్యనారాయణ, ఎ.జగదీష్, కమలా రాజశేఖర్, నక్కా వెంకన్న యాదవ్, వి.కామేశ్వరరావు, సిద్ధారెడ్డి, యుగంధర్, బానోత్ రాము, ప్రసాద్, మధు, పి.ప్రజ్ఞ, మధుమోహన్ రెడ్డి, జి.సంజీవరావు, బాలకృష్ణ, ఆర్. కృష్ణవేణి, ఆదినారాయణ పాల్గొన్నారు. కాగా. పెద్ద నల్లబల్లి గ్రామానికి చెందిన 70 మంది పోడు పట్టాలు రాలేదని ఎమ్మెల్యే వెంకట్రావుతో కలిసి పీఓ రాహుల్‌ను కలిశారు.
ఐటీడీఏ పీఓ రాహుల్