
పిడుగుపాటుతో రైతు మృతి
మణుగూరుటౌన్: వ్యవసాయ పనులకు వెళ్లిన రైతు.. పిడుగుపాటుతో పొ లం వద్దే మృతిచెందిన ఘటన మణుగూరు మండలం రేగులగండిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుడు కుంజా జగన్ (40) శనివారం మధ్యాహ్నం పొలానికి వెళ్లి పని చేస్తుండగా సమీపంలోనే పిడుగుపడింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన జగన్‌ను తోటి రైతులు మణుగూరులోని 100 పడకల ఆస్పత్రికి తీసుకురాగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. జగన్‌కు భార్య దేవి, నలుగురు పిల్లలు ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని సీపీఎం మండల కార్యదర్శి సాంబశివరావు ప్రభుత్వాన్ని కోరారు.
వాగులో మునిగి వృద్ధుడు మృతి
గుండాల: గతంలో నడిచిన దారే కదా అని వాగుప్రవాహాన్ని అంచనా వేయ కుండా దాటే ప్రయత్నంలో నీళ్లలో ముని గి ఓ వృద్ధుడు మృతిచెందిన ఘటన మండలంలో శనివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ సైదా రవూఫ్, స్థానికుల కథ నం ప్రకారం.. మండలంలోని కొడవటంచ గ్రామానికి చెందిన ఈసంపాపయ్య (60) శుక్రవారం కిన్నెరసాని సమీపంలోని తన పొలంలో పనిముగించుకుని పడుగోనిగూ డెం మీదుగా గుండాలకు వచ్చి పింఛన్ డబ్బులు తీసుకుని తిరుగుప్రయాణంలో యాపలగడ్డ నుంచి కొడవటంచకు వెళ్తున్నాడు. కిన్నెరసాని వాగుపై పడుగోనిగూడెం వద్ద చెక్‌డ్యాం నిర్మించారు. దీంతో రెండు కి.మీల వరకు నీళ్లు ఎక్కువ లోతులో నిల్వ ఉన్నా యి. లోతు ఉండదనుకుని వాగు దాటుతుండగా ఒక్కసారిగా నీళ్లలో మునిగిపోయాడు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికారు. శనివారం తెల్లవారు జామున వాగులో శవమై తేలి కనిపించాడు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ సిబ్బందితో ఘటనా ప్రాంతానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇల్లెందు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ పేర్కొన్నారు.
వ్యక్తి మృతిపై కేసు
భద్రాచలంటౌన్: ద్విచక్ర వాహన ప్రమాదంలో ఓ వ్యక్తి గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటనపై భద్రాచలం పట్టణ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. పట్టణంలోని ఐటీడీఏ క్వాటర్లలో ఉండే తోట వెంకటేశ్వర్లు గత నెల 28న వ్యక్తిగత పనిపై చర్ల రోడ్డు వైపు వెళ్లి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో తలకు తీవ్ర గాయం కావడంతో కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కోసం ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వెంకటేశ్వర్లు ఈ నెల 13న మృతి చెందాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్‌ఐ జి.స్వప్న కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చోరీ ఘటనపై..
ములకలపల్లి: కిరాణా దుకాణంలో చోరీ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశా రు. ఎస్‌ఐ రాజశేఖర్ కథనం మేరకు.. రాజుపేట గ్రామవాసి కంపసాటి గోవిందు తన ఇంటిసమీపంలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. రోజూలాగానే విక్రయా లు జరిపి, బుధవారం రాత్రి షట్టర్ తాళం వేసి ఇంటికి వచ్చాడు. కూలర్‌పై తాళంచెవి పెట్టి నిద్రించాడు. గురువారం ఉదయం లేచి వెతుకగా తాళం చెవి కనిపించకపోవడంతో దుకాణం వద్దకు రాగా షట్టర్ తాళం అలాగే ఉంది. మారు తాళంచెవి తో షట్టర తెరిచి చూడగా రూ.95 వేలు చోరీకి గురైనట్లు గుర్తించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

పిడుగుపాటుతో రైతు మృతి