
వైల్డ్‌లైఫ్ చెక్‌పోస్టు తనిఖీ
పాల్వంచరూరల్: యానంబైల్ రేంజ్ కిన్నెరసానిలోని వైల్డ్‌లైఫ్ చెక్‌పోస్టులో ఇన్‌చార్జి ఎఫ్‌డీఓ కృష్ణమాచారి శనివారం తనిఖీ చేశారు. పర్యాట కులకు విక్రయించే టోపీలు, టీషర్టులను పరి శీలించారు. అనంతరం మొండికట్ట బీట్‌లో ఫారెస్ట్ ప్లాంటేషన్‌ను సందర్శించారు. వైల్డ్‌లైఫ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. డీర్ పార్కు వద్ద రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు.
నేడు మైనింగ్ గ్రాడ్యుయేట్ ట్రైనీ రాత పరీక్ష
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణిలో ఖాళీగా ఉన్న మైనింగ్ గ్రాడ్యుయేట్ ట్రైనీ (ఇంటర్నల్), ఈ–2 గ్రేడ్ 30 పోస్టులకు, జూనియర్ ఆఫీసర్ ఈ–గ్రేడ్–1 రెండు పోస్టులకు ఆదివారం రాత పరీక్ష నిర్వహించనున్నట్లు యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. సంస్థలో పనిచేసే ఉద్యోగులతోనే ఈ పోస్టులు భర్తీ చేస్తామని పేర్కొంది. కొత్తగూడెంలోని సింగరేణి మహిళా డిగ్రీ కళాశాలలో నేడు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష ఉంటుందని తెలిపింది.
సూపర్‌బజార్ ఎండీగా మురళీధర్
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సూపర్‌బజార్ ఎండీగా ఎ.జె.మురళీధర్‌ను నియమిస్తూ యాజమాన్యం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ఎండీ నికోలస్‌ను రిక్రూట్‌మెంట్ సెల్ జీఎంగా నియమించగా, ఆ స్థానంలో ఈఈ సెల్ హెచ్‌ఓడీగా ఉన్న మురళీధర్‌కు అవకాశం కల్పించారు.
కాంటాల జాప్యంపై
రైతు ఆగ్రహం
నేలకొండపల్లి: ధాన్యం కాంటాల్లో జాప్యం జరుగుతుండడంతో ఓ రైతు రోడ్డుపై ధాన్యం పోసి నిప్పంటించేందుకు యత్నించాడు. మండల కేంద్రంలోని మార్కెట్‌లో ఏర్పాటు చేసిన డీసీఎంఎస్ కేంద్రానికి 50 రోజుల కిందట తాతా హనుమంతరావు ధాన్యం తీసుకొచ్చాడు. ఇప్పటివరకు కాంటా వేయకపోగా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తుండడంతో శనివారం ఆయన బోదులబండ – నేలకొండపల్లి రహదారిపై ధాన్యం బస్తాలను వేసి నిప్పంటించేందుకు యత్నించాడు. దీంతో సహచర రైతులు అడ్డుకోగా, తహసీల్దార్ వెంకటేశ్వర్లు చేరుకుని నచ్చజెప్పారు. త్వరగా కాంటా వేయిస్తామని నిర్వాహకులు చెప్పడంతో ఆందోళన సద్దుమణిగింది.
విధి నిర్వహణలో ఐటీసీ కార్మికుడికి గుండెపోటు
చికిత్స పొందుతూ మృతి
బూర్గంపాడు: సారపాక ఐటీసీ పీఎస్‌పీడీలో విధులు నిర్వహిస్తున్న పర్మనెంట్ కార్మికుడు శనివారం గుండెపోటుతో మృతిచెందాడు. బూర్గంపాడుకు చెందిన ఎండీ షంషుద్దీన్(40) శనివారం ఉదయం విధులకు హాజరై గుండెపోటుతో అస్వస్థతకు గురయ్యాడు. అతనిన్ని చికిత్స నిమిత్తం ఐటీసీ డిస్పెన్సరీకి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతదేహాన్ని కార్మిక సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, రాజకీయనాయకులు సందర్శించి నివాళులర్పించారు. విధులకు వెళ్లిన భర్త విగతజీవిగా ఇంటికి చేరటంతో భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులు గుండెలావిసేలా రోదిస్తున్నారు. క్రీడాకారుడిగా గుర్తింపు సాధించిన షంషుద్దీన్ మృతితో బూర్గంపాడులో విషాదం అలుముకుంది. స్థానికంగా క్రికెట్ టోర్నమెంట్‌ల నిర్వహణలో ఆయన కీలకంగా పనిచేసేవారు. మృతిపట్ల మిత్రులు, క్రీడాకారులు సంతాపం వ్యక్తం చేశారు.
పోలీస్ శాఖలో బదిలీలు
దుమ్ముగూడెం: జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్‌లలో విధులు నిర్వహిస్తున్న 179 మంది కానిస్టేబుళ్లు, 15 మంది హెడ్ కానిస్టేబుళ్లను బదిలీ చేస్తూ ఎస్పీ రోహిత్‌రాజ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా స్టేషన్లలో వారు విధులు నిర్వహించబట్టి సుదీర్ఘకాలం అయినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దుమ్ముగూడెం స్టేషన్‌లో ముగ్గురు హెడ్‌కానిస్టేబుళ్లు, తొమ్మిది మంది కానిస్టేబుళ్లను జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లకు బదిలీ చేశారు.

వైల్డ్‌లైఫ్ చెక్‌పోస్టు తనిఖీ

వైల్డ్‌లైఫ్ చెక్‌పోస్టు తనిఖీ