
సీఈఓపై మొక్కుబడిగా విచారణ!
అశ్వారావుపేటరూరల్: అశ్వారావుపేట సహకార సంఘంలో సీఈఓగా పనిచేస్తున్న మానేపల్లి విజయబాబు ధాన్యం కొనుగోళ్లలో తరుగు పేరుతో దోపిడీ చేయడం, రైస్‌మిల్లర్లతో లాలూచీ పడుతు న్నట్లు సొసైటీ డైరెక్టర్ బత్తిన పార్థసారథి ఆధ్వర్యంలో ఇటివల డీసీఓ ఖుర్షీద్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదుపై స్పందించిన డీసీఓ విచారణకు ఆదేశించి, ప్రత్యేకాధికారిగా వీరేశంబాబును నియమించారు. ఆయన శుక్రవారం అశ్వారావుపేటలోని సహకార సంఘం కార్యాలయంలో సొసైటీ అధ్యక్షులు చిన్నంశెట్టి సత్యనారాయణ సమక్షంలో విచారణ చేపట్టారు. ఈ విచారణకు ఫిర్యాదుదారుడు బత్తిన పార్థసారథితోపాటు కొందరు రైతులు హాజరయ్యారు. ఫిర్యా దులోని అంశాలను పక్కన పెట్టి, కేవలం ధాన్యం కేంద్రాల్లో ఉన్న ఇక్కట్లు, ఇప్పటిదాకా ధాన్యం కొనుగోలు చేయకపోడం వంటి అంశాలపై విచారణ చేపట్టారు. కనీసం ధాన్యం కేంద్రాల వద్దకు కూడా వెళ్లకుండా, అక్కడికి వచ్చిన రైతులతోనే మాట్లాడి విచారణను ముగించడం అను మానాల కు తావిస్తోంది. దీంతో ఫిర్యాదుదారుడు అసంతృప్తి వ్యక్తం చేసి, మరోసారి విచారణాధికారికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు అందించారు. ఇదే అంశాలపై సొసైటీ రిజిస్ట్రార్, జిల్లా కలెక్టర్, విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు పార్థసారథి తెలిపా రు. కాగా, విచారణాధికారి మాట్లాడుతూ.. ఫిర్యా దు చేసిన సొసైటీ డైరెకర్లు, రైతులు పూర్తిస్థాయిలో హాజరు కాలేదని, దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తానని చెప్పారు.
సొసైటీ డైరెక్టర్ల అసంతృప్తి