Weekly Horoscope: ఈ రాశి వారు వారం మధ్యలో గుడ్‌ న్యూస్‌ వింటారు

Weekly Horoscope Telugu 31-07-2022 To 06-08-2022 - Sakshi

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఆర్థిక వ్యవహారాలు మీ అంచనాలకు తగినట్లుగా కొనసాగుతాయి. శ్రేయోభిలాషుల సలహాలతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అనూహ్యంగా ఆస్తులను సమకూర్చుకుంటారు. ఒక ప్రకటన నిరుద్యోగులకు వరంగా మారతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో మీ ప్రతిభ నిరూపించుకుని ముందుకు సాగుతారు. పారిశ్రామికరంగం వారికి నూతనోత్సాహం. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివస్తుతి మంచిది.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
విద్యార్థులకు ఊహించని అవకాశాలు రావచ్చు. ఏ పని చేపట్టినా విజయమే. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులను సమకూర్చుకుని మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఎటువంటి బాధ్యతలైనా తేలిగ్గా పూర్తి చేస్తారు. కళారంగం వారు తమ సత్తా చాటుకునేందుకు తగిన సమయం. వారం ప్రారంభంలో సోదరులతో కలహాలు. మానసిక ఆందోళన. తెలుపు, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీ నృసింహమహామంత్రం పఠించండి.

మిథునం (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి మెరుగుపడి అవసరాలు తీరతాయి. వాహనాలు, భూముల. చిన్ననాటి మిత్రులను కలుసుకుని వారి సలహాలు స్వీకరిస్తారు. వేడుకల నిర్వహణపై బంధువులతో సంప్రదిస్తారు. వ్యాపారాలు అనుకున్న విధంగా లాభించి మరింత ఉత్సాహంగా సాగుతారు. ఉద్యోగాలలో ఒత్తిడులను అధిగమిస్తారు. రాజకీయవర్గాలకు  ఊహించని పిలుపు రావచ్చు. వారం మధ్యలో వ్యయప్రయాసలు. అనుకోని ధనవ్యయం. పసుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆర్థికంగా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంటుంది. ఆరోగ్యసమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. విద్యార్థులకు శ్రమాధిక్యమే తప్ప ఫలితం కనిపించదు. వ్యాపార లావాదేవీలు అంచనాలకు తగినట్లు లేక నిరాశ చెందుతారు. ఉద్యోగవర్గాలకు మార్పులు అనివార్యం. వారం మధ్యలో శుభవార్తలు. ధన, వస్తులాభాలు. పసుపు, ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయస్తుతి మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
మీ సమర్థతను చాటుకుని అందరిలోనూ గుర్తింపు పొందుతారు. ఉద్యోగయత్నాలలో నెలకొన్న ప్రతిష్ఠంభన తొలగుతుంది. విద్యార్థులకు అనుకూల వాతావరణం. ఇంటి  నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాలలో పురోభివృద్ధి, అనూహ్యమైన లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో సంతోషకరమైన వార్తలు. కళాకారులకు సన్మానయోగం. వారం చివరిలో అనారోగ్యం. ధనవ్యయం. పసుపు, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఇంతకాలం ఎదుర్కొన్న ఇబ్బందులు తీరతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలించి ఊపిరిపీల్చుకుంటారు. విద్యార్థులు, నిరుద్యోగులు లక్ష్యసాధనలో సఫలమవుతారు. వ్యాపారవర్గాలకు తగినంతగా లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో మీ సేవలు విస్తృతమవుతాయి. సమర్థత చాటుకునే సమయం. పారిశ్రామికవర్గాల ఆశలు ఎట్టకేలకు ఫలిస్తాయి. వారం  ప్రారంభంలో వ్యయప్రయాసలు. స్వల్ప అనారోగ్యం. ఆకుపచ్చ, నేరేడు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠనం మంచిది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు అధిగమించి సకాలంలో పూర్తి చేస్తారు. ఇతరులకు సైతం ధనరూపేణా సహాయపడతారు. వాహనయోగం. వ్యాపారాలలో ఊహించని పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ప్రశంసలు. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది.  వారం చివరిలో ఖర్చులు. కుటుంబసమస్యలు. తెలుపు, నీలం రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తుతి మంచిది.

వృశ్చికం (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక పరిస్థితి మందగించినా అవసరాలకు లోటు రాదు. ఇంటాబయటా ఒత్తిడులు తొలగి ఊరట చెందుతారు. నిరుద్యోగుల యత్నాలలో పురోగతి. వాహనాలు, గృహం కొనుగోలు చేసే వీలుంది. వ్యాపారాలలో మీ కృషి ఫలించే సమయం. ఉద్యోగాలలో అవాంతరాలు అధిగమిస్తారు. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. వారం చివరిలో ధనవ్యయం. ఎరుపు, గులాబీ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ చాలీసా పఠనం మంచిది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఏ పని చేపట్టినా పూర్తి చేసేవరకూ విశ్రమించరు. మీ ఆశయాల సాధనలో మిత్రులు సహకరిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ శ్రమ ఫలిస్తుంది. వాహన, గృహయోగాలు కలుగవచ్చు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలలో విస్తరణ కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారు. పారిశ్రామికవర్గాలకు అనూహ్యమైన అవకాశాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు గులాబీ, పసుపు రంగులు. సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ బాధ్యతలు సమర్థంగా నిర్వ స్తారు. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఒక కీలక కేసుపై కోర్టుల్లో అనుకూలత. వ్యాపారాలలో అంచనాల మేరకు లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో సహచరుల సాయం అంది హుషారుగా గడుపుతారు. కళారంగం వారి కృషి ఫలించే సమయం. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. నీలం, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక లావాదేవీలలో చిక్కులు తొలగుతాయి. రుణయత్నాలు విరమిస్తారు. ఆస్తి, కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపారాలలో ఆటంకాలు అధిగమించి లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగాలలో మీ సత్తా చాటుకుంటారు. రాజకీయవర్గాలకు కొత్త పదవులు రావచ్చు. వారం మధ్యలో మానసిక అశాంతి. నేరేడు, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

మీనం (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
కొత్త  పనులు ప్రారంభించి నిర్దేశిత గడువులోగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రుణబాధలు తొలగుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాలలో విస్తరణ కార్యక్రమాలను పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో మీ అంచనాలు ఫలిస్తాయి. కళాకారులకు కొన్ని పురస్కారాలు రావచ్చు. వారం చివరిలో అనుకోని ఆస్తి వివాదాలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చే యండి. 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top