ఈ రాశివారికి బాకీలు వసూలవుతాయి

Today Horoscope In Telugu 28-07-2021 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం, తిథి బ.పంచమి తె.4.44 వరకు (తెల్లవారితే గురువారం), తదుపరి షష్ఠి, నక్షత్రం పూర్వాభాద్ర ప.1.30 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర, వర్జ్యం రా.11.33 నుండి 1.14 వరకు, దుర్ముహూర్తం ప.11.38 నుండి 12.32 వరకు అమృతఘడియలు... లేవు.

సూర్యోదయం :    5.40
సూర్యాస్తమయం    :  6.32
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు

రాశి ఫలాలు:

మేషం: వ్యవహారాలలో అవరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువుల కలయిక. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా కొనసాగుతాయి.

వృషభం: సన్నిహితుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. ఆర్థిక ప్రగతి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం. సోదరులతో సఖ్యత. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

మిథునం: నూతన ఉద్యోగప్రాప్తి. సమాజసేవలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురుండదు.

కర్కాటకం: వ్యయప్రయాసలు. మిత్రుల నుంచి సమస్యలు. పనుల్లో ఆటంకాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.

సింహం: రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు నెలకొంటాయి.

కన్య: వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు.

తుల: అందరిలోనూ గౌరవం పెరుగుతుంది. ఆత్మీయులు దగ్గరవుతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో విశేష ఆదరణ.

వృశ్చికం: మిత్రులతో కలహాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసమస్యలతో సతమతవుతారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

ధనుస్సు: ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని చికాకులు.

మకరం: కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.

కుంభం: వ్యవహారాలు మందగిస్తాయి. దూరప్రయాణాలు. భూవివాదాలు. అనారోగ్యం. సోదరులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు తప్పుతాయి.

మీనం: శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. పనులు సకాలంలో పూర్తి. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశ్చర్యకరమైన మార్పులు.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top