ఈ రాశివారికి ఆస్తి వివాదాలు నెలకొంటాయి | Today-Horoscope-In-Telugu-17-08-2021 | Sakshi
Sakshi News home page

ఈ రాశివారికి ఆస్తి వివాదాలు నెలకొంటాయి

Aug 17 2021 6:29 AM | Updated on Aug 17 2021 6:31 AM

Today-Horoscope-In-Telugu-17-08-2021 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి శు.దశమి రా.2.34 వరకు, తదుపరి ఏకాదశి నక్షత్రం జ్యేష్ఠ రా.1.51 వరకు, తదుపరి మూల, వర్జ్యం ఉ.8.43 నుండి 10.11 వరకు, దుర్ముహూర్తం 8.16 నుండి 9.06 వరకు తదుపరి రా.10.55 నుండి 11.40 వరకు అమృతఘడియలు... సా.5.37 నుండి 7.08 వరకు.

సూర్యోదయం :    5.46
సూర్యాస్తమయం    :  6.22
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు

రాశి ఫలాలు:

మేషం... క్లిష్టమైన సమస్యల పరిష్కారం. శుభవార్తలు. బంధువుల నుంచి ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

వృషభం...  వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. విద్యావకాశాలు లభిస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. వస్తు, వస్త్రలాభాలు. స్థిరాస్తివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. 

మిథునం....  యత్నకార్యసిద్ధి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. సంఘంలో గౌరవం దక్కుతుంది. భూ, గృహయోగాలు. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

కర్కాటకం...  శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. ఆరోగ్యం మందగిస్తుంది. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశపరుస్తాయి.

సింహం...  రాబడి అంతగా కనిపించదు. ఆస్తుల వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో ఆకారణంగా విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

కన్య...  ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని వివాదాలు తీరతాయి. వ్యాపారాలలో అభివృద్ధి. ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.

తుల...  కుటుంబంలో ఒత్తిడులు. పనుల్లో అవాంతరాలు. ధనవ్యయం. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. మిత్రుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.

వృశ్చికం...  కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. సన్నిహితుల నుంచి కీలక సమాచారం. ధనలాభ సూచనలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఊహలు నిజం కాగలవు.

ధనుస్సు...  వ్యవహారాలలో ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. స్థిరాస్తి వివాదాలు. అనారోగ్యం. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలు చిక్కులు ఎదురుకావచ్చు.

మకరం....  అనుకోని ధనలాభం. అప్రయత్న కార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

కుంభం...  ఇంటర్వ్యూలు అందుతాయి. కొన్ని వ్యవహారాలు సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు. «ఆర్థిక విషయాలలో పురోగతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో శ్రమ ఫలిస్తుంది.

మీనం....  వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. దూరప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. ఆస్తి వివాదాలు. సోదరులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత అసంతృప్తి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement