ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది | Today Horoscope 29-06-2022 | Sakshi
Sakshi News home page

Today's Horoscope: ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది

Jun 29 2022 6:51 AM | Updated on Jul 21 2022 10:13 AM

Today Horoscope 29-06-2022 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం. గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి అమావాస్య ఉ.6.44 వరకు. తదుపరి ఆషాఢ శు.పాడ్యమి, నక్షత్రం ఆరుద్ర రా.9.09 వరకు తదుపరి పునర్వసు, వర్జ్యం... లేదు. దుర్ముహూర్తం ప.11.35 నుండి 12.28 వర కు. అమృతఘడియలు... ఉ.10.02 నుండి 11.51 వరకు.

సూర్యోదయం :    5.31, 
సూర్యాస్తమయం :  6.34, 
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు.. 
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు 

మేషం: పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు నూతనోత్సాహం.

వృషభం: బంధుమిత్రులతో కలహాలు. దూరప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. 

మిథునం: ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి. ఆదాయం పెరుగుతుంది. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారులు ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగులకు పదోన్నతులు.

కర్కాటకం: ఓర్పుతో వ్యవహరించాలి. ఆరోగ్య, కుటుంబసమస్యలు. భూవివాదాలు. అనుకోని ఖర్చులు. వ్యాపారులకు తొందరపాటు తగదు. ఉద్యోగులకు పనిఒత్తిడులు.

సింహం: కొత్త పనులు చేపడతారు. బంధువుల నుంచి కీలక సమాచారం. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. విద్యార్థుల యత్నాలు అనుకూలిస్తాయి..

కన్య: ముఖ్యమైన పనులు అనుకున్న రీతిలో పూర్తి. ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వ్యవహారాల్లో నూతన అగ్రిమెంట్లు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.

తుల: కుటుంబసభ్యులతో విభేదాలు. శ్రమ పెరుగుతుంది. పనుల్లో అవాంతరాలు. రాబడి కంటే ఖర్చులు  అధికం. ఇతరుల నుంచి విమర్శలు. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.

వృశ్చికం: కొన్ని కార్యక్రమాలను వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. వ్యాపారులు నిరాశ చెందుతారు. ఉద్యోగులకు ఒత్తిడులు. రాబడి తగ్గుతుంది. దేవాలయాలు సందర్శిస్తారు.

ధనుస్సు: ప్రతిభాపాటవాలు వెలుగుచూస్తాయి. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. కార్యజయం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా కొనసాగుతాయి.

మకరం: ఉద్యోగ ప్రయత్నాలు పురోగతి. సంఘంలో గౌరవం. పలుకుబడి పెంచుకుంటారు. నూతన కార్యక్రమాలు చేపడతారు. వ్యాపార వృద్ధి. ఉద్యోగులకు కొత్త ఆశలు.

కుంభం: పరిస్థితులు అనుకూలించవు. ప్రయాణాల్లో మార్పులు. రాబడి నిరాశ కలిగిస్తుంది. అనారోగ్యం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులు మరింత శ్రమపడాలి.

మీనం: పనులు మందగిస్తాయి. అనుకోని ప్రయాణాలు. ఇంటిలో వివాదాలు. శారీరక రుగ్మతలు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు. దేవాలయ దర్శనాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement