ఈ రాశివారు విందు, వినోదాల్లో పాల్గొంటారు

Today Horoscope 29-04-2022 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్ర మాసం, తిథి బ.చతుర్దశి రా.12.44 వరకు, తదుపరి అమావాస్య నక్షత్రం రేవతి రా.6.48 వరకు, తదుపరి అశ్వని, వర్జ్యం ఉ.6.33 నుండి 8.11 వరకు, దుర్ముహూర్తం ఉ.8.11 నుండి 9.02  వరకు తదుపరి ప.12.21 నుండి 1.11 వరకు అమృతఘడియలు... సా.4.20 నుండి 5.59 వరకు..

సూర్యోదయం :    5.40
సూర్యాస్తమయం     :  6.14
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు 

రాశి ఫలాలు..

మేషం: పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

వృషభం: సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థికాభివృద్ధి. వస్తులాభాలు. పరపతి పెరుగుతుంది. స్థిరాస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి.

మిథునం: ఆసక్తికర సమాచారం. శుభవార్తలు అందుతాయి. సోదరులతో విభేదాలు పరిష్కారం. ధన, వస్తులాభాలు. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

కర్కాటకం: సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనుల్లో అవాంతరాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

సింహం: పరిస్థితులు అంతగా కలిసిరావు. కుటుంబంలో ఒత్తిడులు. పనులు నిదానిస్తాయి. ముఖ్య సమాచారం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపూరితంగా ఉంటాయి.

కన్య: చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విలువైన వస్తువులు సేకరిస్తారు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు.

తుల: పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. బంధువుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

వృశ్చికం: అనుకున్న పనుల్లో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. బంధువులతో తగాదాలు. శ్రమాధిక్యం. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.

ధనుస్సు: రుణయత్నాలు. పనుల్లో జాప్యం. ఆరోగ్యం మందగిస్తుంది. లేనిపోని చికాకులు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు.

మకరం: ప్రముఖులతో పరిచయాలు. ఆకస్మిక ధనలబ్ధి. బంధువుల నుంచి ఆహ్వానాలు. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.

కుంభం: సన్నిహితులతో మాటపట్టింపులు. వృథా ఖర్చులు. కుటుంబంలో గందరగోళం. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

మీనం: మిత్రులతో వివాదాలు తీరతాయి. ధన, వస్తులాభాలు. గతం గుర్తుకు వస్తుంది. నూతన ఉద్యోగాలు లభిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top