ఈ రాశి వారికి ప్రముఖుల నుండి ఆహ్వానాలు.. విందువినోదాలు

Today Horoscope 28-12-2022 - Sakshi

శ్రీ శుభకృత్‌నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, తిథి: శు.షష్ఠి రా.3.03 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం: శతభిషం రా.7.06 వరకు, తదుపరి పూర్వాభాద్ర, వర్జ్యం: రా.1.11 నుండి 2.44 వరకు, దుర్ముహూర్తం: ప.11.40 నుండి 12.22 వరకు, అమృత ఘడియలు: ప,12.20 నుండి 11.54 వరకు.;

రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు;
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు;
సూర్యోదయం 6.33;
సూర్యాస్తమయం 5.30. 

మేషం: వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. ఆస్తులు కొనుగోలు చేస్తారు. మీ శ్రమ వృథా కాదు. విద్యావకాశాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఉన్నత స్థితి.

వృషభం: నూతన వాహనయోగం. చర్చలు సఫలం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనూహ్యమైన మార్పులు.

మిథునం: వ్యవహారాలలో అవాంతరాలు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

కర్కాటకం: కొన్ని పనులు ముందుకు సాగవు. ప్రయాణాలలో అవాంతరాలు. ఆరోగ్యసమస్యలు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

సింహం: ఆకస్మిక ధనలాభం. ప్రయాణాలలో నూతన పరిచయాలు. సంఘంలో విశేష ఆదరణ. సన్నిహితుల నుండి శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పూర్వవైభవం.

కన్య: రుణయత్నాలు విరమిస్తారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. విద్య, ఉద్యోగావకాశాలు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అంచనాలు మేరకు కొనసాగుతాయి.

తుల: రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో తొందరపాటు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

వృశ్చికం: రాబడికి మించి ఖర్చులు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు.

ధనుస్సు: కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సర్దుబాట్లు చేసుకుంటారు.

మకరం: మిత్రులతో కలహాలు. రుణదాతల ఒత్తిడులు. ఆలోచనలు స్థిరంగా సాగవు. బంధువుల నుండి ముఖ్య సమాచారం. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

కుంభం: ఇంటాబయటా ప్రోత్సాహం. ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖుల నుండి ఆహ్వానాలు. విందువినోదాలు. కార్యజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

మీనం: పనుల్లో ఆటంకాలు. వృథా ఖర్చులు. ప్రయాణాలలో మార్పులు. అనారోగ్యం. సోదరులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top