
ఈ రాశివారికి చేపట్టిన పనుల్లో విజయం దక్కుతుంది. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం కూడా.
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం,
తిథి: బ.సప్తమి ఉ.7.39 వరకు,
తదుపరి అష్టమి
నక్షత్రం: పునర్వసు తె.4.23 వరకు (తెల్లవారితే మంగళవారం)
తదుపరి పుష్యమి,
వర్జ్యం: ప.3.06 నుండి 4.50 వరకు
దుర్ముహూర్తం: ప.12.07 నుండి 12.54 వరకు,
తదుపరి ప.2.29 నుండి 3.14 వరకు,
అమృతఘడియలు: రా.1.43 నుండి 3.27 వరకు.
సూర్యోదయం : 5.56
సూర్యాస్తమయం : 5.35
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు
మేషం: మీ సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. అప్రయత్నంగా పనులు పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.
వృషభం: సన్నిహితులు, మిత్రులతో ఆకారణంగా విభేదాలు. దూరప్రయాణాలు. ఆస్తి వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.
మిథునం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తులు మరింత సహకరిస్తారు. వస్తులాభాలు. కోర్టు వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
కర్కాటకం: పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది పెట్టవచ్చు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.
సింహం: వ్యవహార విజయం. శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ధనలాభం. పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు ఉత్సాహాన్నిస్తాయి.
కన్య: రుణఒత్తిడులు తొలగుతాయి. ఆప్తుల ద్వారా శుభవార్తలు. వాహనాలు కొంటారు. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలలో వేగం పెరుగుతుంది. ఉద్యోగాలలో పని ఒత్తిడుల నుండి బయటపడతారు.
తుల: వివాదాలకు దూరంగా ఉండండి. వ్యవహారాలలో ఆటంకాలు. ప్రయాణాలు ముందుకు సాగవు. బంధువులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.
వృశ్చికం: రుణభారాలు. అనుకోని ప్రయాణాలు. విద్య, ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. పనులు వాయిదా పడతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
ధనుస్సు: సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ధనప్రాప్తి. సంఘంలో గౌరవం. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
మకరం: పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. వస్త్రలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.
కుంభం: పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి అయోమయంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు. విలువైన వస్తువులు చేజారవచ్చు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని ఇబ్బందులు.
మీనం: కుటుంబసభ్యుల నుండి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యభంగం. శ్రమ తప్ప ఫలితం కానరాదు. విద్యావకాశాలు చేజారతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.