
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి: బ. పంచమి రా.7.38 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం: స్వాతి ఉ.6.23 వరకు, తదుపరి విశాఖ, వర్జ్యం: ప.11.55 నుండి 1.29 వరకు, దుర్ముహూర్తం: సా.4.31 నుండి 5.16 వరకు, అమృతఘడియలు: రా.9.22 నుండి 10.57 వరకు.
సూర్యోదయం : 6.15
సూర్యాస్తమయం : 6.05
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు..
మేషం: వ్యవహారాలలో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. ఆప్తుల నుండి కీలక సందేశం. ఆర్థికాభివృద్ధి. వ్యాపార, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.
వృషభం: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో సఖ్యత. కీలక నిర్ణయాలు. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
మిథునం: పనులలో అవాంతరాలు. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు.
కర్కాటకం: కొన్ని ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి.
సింహం: సాహసకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో పురోగతి. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
కన్య: బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. ధనవ్యయం. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
తుల: శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. మీ సత్తా చాటుకుంటారు. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అభివృద్ధి సాధిస్తారు.
వృశ్చికం: వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. మీ కష్టానికి ఫలితం కనిపించదు. ఆస్తులు విషయంలో చికాకులు. వ్యాపార, ఉద్యోగాలలో ఇబ్బందికర పరిస్థితులు.
ధనుస్సు: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా కొనసాగుతాయి.
మకరం: సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. మీ సేవలకు గుర్తింపు లభిస్తుంది. ఆహ్వానాలు అందుతాయి. కార్యజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.
కుంభం: ఆశ్చర్యపరిచే సంఘటనలు. ఆర్థికంగా ఇబ్బందులు. హఠాత్తుగా ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.
మీనం: బంధుమిత్రులతో కలహాలు. రుణయత్నాలు సాగిస్తారు. ప్రయాణాలలో అవాంతరాలు. దైవదర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.