ఈ రాశివారికి రుణ బాధలు తొలగుతాయి

Daily Horoscope In Telugu 28 May 2021 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి బ.విదియ ప.12.39 వరకు, తదుపరి తదియ నక్షత్రం మూల రా.11.39 వరకు, తదుపరి పూర్వాషాఢ, వర్జ్యం రా.10.10 నుంచి 11.39 వరకు, దుర్ముహూర్తం ఉ.8.05 నుంచి 8.56 వరకు, తదుపరి ప.12.21 నుండి 1.14 వరకు అమృతఘడియలు... సా.5.38 నుంచి 7.02 వరకు.

సూర్యోదయం :    5.29
సూర్యాస్తమయం    :  6.25
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు 

మేషం: కుటుంబంలో చికాకులు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు.

వృషభం: పనులు నెమ్మదిగా సాగుతాయి. దూరప్రయాణాలు. అనుకోని ధనవ్యయం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగమార్పులు. ఆరోగ్యభంగం.

మిథునం: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రుణబాధలు తొలగుతాయి. కొత్త పరిచయాలు.  పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం. 

కర్కాటకం: పనులు విజయవంతంగా పూర్తి. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. ఆప్తులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అభివృద్ధి.

సింహం: చేపట్టిన కార్యక్రమాలలో స్వల్ప ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

కన్య: కొన్ని పనులు వాయిదా. శ్రమా«ధిక్యం. ఆరోగ్యభంగం. కుటుంబసభ్యులతో వివాదాలు. అనుకోని సంఘటనలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

తుల: ప్రయత్నాలు సఫలం. సంఘంలో గౌరవం. ధన,వస్తులాభాలు. ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

వృశ్చికం: ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. శ్రమాధిక్యం. పనులు వాయిదా వేస్తారు. బంధుమిత్రులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.

ధనుస్సు: ఆధ్యాత్మిక చింతన. విలువైన సమాచారం. బంధువుల కలయిక.  నూతన పదవీయోగం. ముఖ్య నిర్ణయాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

మకరం: వ్యయప్రయాసలు. పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు ఒత్తిడులు.

కుంభం: ఉద్యోగాలలో ఉన్నతహోదాలు. పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి సహాయం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.

మీనం: ఆలోచనలు కలసివస్తాయి. నూతన విద్య, ఉద్యోగయోగాలు. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.
 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top