ఈ రాశివారు పనులు మధ్యలో విరమిస్తారు

Daily Horoscope In Telugu 22nd July 2021 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం తిథి శు.త్రయోదశి ప.12.18 వరకు, తదుపరి, చతుర్దశి, నక్షత్రం మూల సా.4.10 వరకు, తదుపరి పూర్వాషాఢ వర్జ్యం ప. 2.37 నుండి 4.10 వరకు, తిరిగి రా.1.12 నుండి 2.43 వరకు, దుర్ముహూర్తం ఉ.9.56 నుండి 10.47 వరకు, తదుపరి ప.3.07 నుండి 3.57 వరకు, అమృతఘడియలు... ఉ.10.10 నుండి 11.37 వరకు.

సూర్యోదయం :    5.39
సూర్యాస్తమయం    :  6.33
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు

రాశి ఫలాలు: 

మేషం : పనులు వాయిదా వేస్తారు.  శ్రమాధిక్యమే. బంధువులతో తగాదాలు.  ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని  ఇబ్బందులు.

వృషభం: మిత్రులు, బంధువుల నుంచి ఒత్తిడులు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. పనులలో జాప్యం. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. 

మిథునం: ఇంటర్వ్యూలు అందుకుంటారు. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు అనుకోని హోదాలు.

కర్కాటకం:  పాతబాకీలు వసూలవుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వాహనయోగం. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం. 

సింహం: పనుల్లో ఆవాంతరాలు. కొత్తగా రుణాలు చేస్తారు. శ్రమ తప్ప ఫలితం ఉండదు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు.

కన్య:   ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. దైవదర్శనాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొంత మార్పులు. 

తుల:  దూరపు బంధువుల కలయిక. యత్నకార్యసిద్ధి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. ఆలయ దర్శనాలు.

వృశ్చికం: కుటుంబసభ్యులతో విభేదాలు. అనుకోని ఖర్చులు. పనులు మధ్యలో విరమిస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు నిరుత్సాహం. ఉద్యోగాలలో ఒత్తిడులు.

ధనుస్సు: ఆకస్మిక ధనలాభం. పరపతి పెరుగుతుంది. పోటీపరీక్షల్లో విజయం. ఆసక్తికర సమాచారం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. 

మకరం:   వ్యయప్రయాసలు.  రాబడికి మించిన ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు. 

కుంభం: వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో సంతోషదాయకంగా ఉంటుంది.

మీనం: నిరుద్యోగులకు సంతోషకరమైన వార్తలు. పనులు సకాలంలో పూర్తి.  వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో నూతనోత్సాహం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top