చేతివృత్తిదారులు ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలి
బద్వేలు అర్బన్ : చేతివృత్తుల పరిరక్షణ, సామాజిక భద్రత, సంక్షేమమే లక్ష్యంగా చేతివృత్తిదారులు ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని చేతివృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామాంజనేయులు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక సీపీఐ కార్యాలయం జెవీ భవన్‌లో నిర్వహించిన చేతివృత్తిదారుల జిల్లా విస్తత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంతో వృత్తి నైపుణ్యంతో సమాజానికి సేవలందిస్తున్న చేతివృత్తిదారులు నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆర్థిక పారిశ్రామిక విధానాల వలన దుర్భరమైన జీవితాలను గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని నరేంద్రమోదీ విశ్వకర్మయోజన పథకం పేరుతో, రాష్ట్రంలోని చంద్రబాబునాయుడు ప్రభుత్వం సూపర్‌సిక్స్ వాగ్ధానాల పేరుతో చేతివృత్తిదారులకు ఎన్నో హామీలు ఇచ్చినప్పటికీ అవి అమలు కావడం లేదని అన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర మాట్లాడుతూ శ్రమజీవుల కష్టాన్ని గుర్తించకపోవడం దారుణమన్నారు.


