జాతీయ స్థాయి పోటీలకు నరహరిపురం హైస్కూల్ విద్యార్థులు
చాపాడు : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగిన ఘట్కా మార్షల్ ఆర్ట్స్ రాష్ట్రస్థాయి పోటీల్లో మండలంలోని నరహరిపురం ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు ప్రధానోపాధ్యాయుడు నరసింహ శాస్త్రి తెలిపారు. అండర్–17 విభాగంలో జ్ఞాన అక్షిత సాయి, శుభలక్ష్మిలు, అండర్–19 విభాగంలో ప్రణవి కాంస్య పతకం సాఽధించారని తెలిపారు. వీరిలో జ్ఞాన అక్షిత సాయి ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం రాయపూర్‌లో జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ందని చెప్పారు. తమ పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయికి ఎంపిక కావడం పట్ల ప్రధానోపాధ్యాయుడు, పీడీ ప్రశాంతి, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.


