జాతీయస్థాయి పోటీలకు మట్లి పెద్దూరు విద్యార్థులు
వీరబల్లి : మండలంలోని మట్లి పెద్దూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జయన్న తెలిపారు. నవంబర్ 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు అహోబిలంలో జరిగిన అండర్–17 బేస్ బాల్ పోటీల్లో వి.హర్షవర్దన్ (పదోతరగతి ) విద్యార్థి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వి జయన్న తెలిపారు. అలాగే జగదీష్ అనే విద్యార్థి కూడా ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికై నట్లు తెలిపారు. ఎంపికై న విద్యార్థులు జనవరి నెలలో ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరంలో మొత్తం ఐదుగురు విద్యార్థులు జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్, బేస్ బాల్‌కు ఎంపిక కావడానికి ప్రత్యేక శిక్షణ ఇచ్చిన వ్యాయామ సంచాలకుడు ఎ.జగదీశ్వరయ్యను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, సిబ్బంది, పాఠశాల కమిటీ చైర్మన్ నాగేశ్వర అభినందించారు.


