● బొగ్గులు పరిశీలన
రెండు యుగాలను కలిపిందా !
ఇనుపయుగ మానవుడు జాడ గుర్తించిన చోటనే బొగ్గులను గుర్తించారు.ఈ బొగ్గులు ఏ కాలం నాటివి అన్నదానిపై ప్రత్యేక పరిశీలన జరపాల్సి ఉందని పురావస్తుశాఖ అసిస్టెంట్ సూపరింటెండెంట్ డాక్టర్ ఏసుబాబు ఆదివారం చెప్పారు.ఇనుపయుగ మానవ కాలంలో నివాస ప్రాంతాలు లేవు. సంచార జాతులుగా ఉన్న వీళ్లు నీటి లభ్యత కలిగిన ప్రాంతాల్లో సంచరిస్తూ జీవించేవాళ్లు. వీరు ఆహారం కోసం జంతువులను వేటాడి వాటిని కాల్చుకుని తిని ఉండాలంటే ఈ బొగ్గులు అవే ఉండవని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నాడు ప్రత్యేక పరిశీలన, అధ్యయనం చేయాల్సి ఉందని చెప్పారు.
మదనపల్లె: అన్నమయ్య జిల్లా సిద్దవటం అటవీ రేంజి పరిధిలోని శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యంలో వెలుగుచూసిన ఇనుపయుగ మానవుల నివాస ఆనవాళ్లపై పూర్తి స్థాయి అధ్యయనం మరుగునపడింది. కేవలం ఒకరోజు నిర్వహించిన సర్వేతోనే ఇది ఆగిపోవడం మూలంగా చరిత్రలో మానవుని సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానం.. ఇలా ఎన్నో అంశాలను వెలికితీయడంతో నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఈఏడాది మార్చి ఒకటిన ఇక్కడి ఆది మానవుని ఆనవాళ్లను గుర్తించి ప్రాముఖ్యత కలిగిన, చారిత్రిక ప్రదేశమని పేర్కొన్న పురావస్తుశాఖ తర్వాత దీని విషయాన్ని విస్మరించింది. లంకమల ఇప్పుడు యుగయుగాలకు చెందిన మానవుల మనుగడ జాడలపై చరిత్రకారుల్లో ఆసక్తి రేపుతోంది. ఎన్ని యుగాలైనా చెరిగిపోని చిత్రలేఖనం ద్వారా ఇనుప యుగపు ఆదిమానవులు ఆనవాళ్లు ఎన్నో కొత్త విషయాలకు, కొత్త అధ్యయనాలకు లంకమల అభయారణ్యం వేదిక ఉన్నప్పటికి లోతైన అధ్యయం లేకపోవడం నిరాశకు గురిచేస్తోంది. క్రీస్తుపూర్వం 2,500 సంవత్సరాల నుంచి క్రీస్తుశకం 2వ శతాబ్దం వరకు ఆది మానవులు లంకమలలోని రోళ్లబోడు బీటుకు చెందిన బండిగాని సెల ప్రాంతంలో నివసించినట్లు భారతీయ పురావస్తుశాఖ నిర్వహించిన పరిశీలన స్పష్టం చేసింది. లభ్యమైన జంతువులు, మనుషుల ఆకారంతో ఉన్న రేఖాగణిత చిత్రాల ఆధారంగా నాటి కాలాన్ని అంచనా వేశారు. ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ రంగులో చిత్రాలను పురావస్తుశాఖ గుర్తించింది. అయితే తొలిసారిగా లంకమలలో నలుపు రంగ తో కలిగిన చిత్రాలు కనిపించడం వాటిని సహజసిద్ధంగా లభించే ముడిరంగులతో గీశా రని స్పష్టమైంది.
నల్లరంగు చిత్రం విశేషం
లంకమలలో వెలుగులోకి వచ్చిన ఇనుపయుగ మానవుడి ఆనవాళ్లలో నల్లరంగు చిత్రాలు పురావస్తుశాఖ అధికారులను ఆశ్చర్యానికి గురిచేశాయి. నల్లరంగు చిత్రాలు ఎక్కడ కూడా కనిపించినట్లు ఆధారాలు లేవని పురావస్తుశాఖ చెబుతోంది. ఇక్కడ నల్లరంగుతో మనిషి చిత్రం ఉండటం అప్పటి కాలానుగుణ పరిస్థితులపై అధ్యయనానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.
యుగాల నాటి ఆది మానవుని ఆనవాళ్లు లభ్యమైనా.. ఒకరోజుతో ముగిసిన అధ్యయనం
క్రీస్తు పూర్వం 2,500 సంవత్సరం నాటివిగా గుర్తింపు
నివేదిక సిద్ధం చేసినా కదలిక లేదు
ప్రపంచానికి సందేశం
లంకమలలో గుర్తించిన ఆది మానవుని ఆనవాళ్లు సాధారణ విషయం కాదు. అక్కడ శోధిస్తే ఇంకెన్నో గుహలు, ఆధారాలు వెలుగుచూసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి జరిపిన పరిశోధనపై పురావస్తుశాఖకు నివేదిక పంపాం. తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంది. లంకమల ప్రపంచానికి కొత్త విషయాలు తెలిపే ప్రదేశంగా మారే అవకాశం లేకపోలేదు. –డాక్టర్ యేసుబాబు, పురావస్తుశాఖ
అసిస్టెంట్ సూపరిండెంట్
బండిగాని సెల అభయారణ్యంలో బండలపై ఇనుపయుగ మానవులకు ఆనవాళ్లుగా నిర్ధారించే ఎరుపు రంగులో గీసిన చిత్రాల్లో తాబేలు, జింక. దుప్పి, లేదా కణితి బొమ్మలు ఎరుపురంగులో ఉన్నాయి. అలాగే తొలి చరిత్ర యుగపు ఆనవాళ్లుగా తెలుపురంగులో ఆవు, కుందేలు, చుక్కల్లో శివలింగ ఆకారం, గుర్రంపై స్వారీ చేస్తున్న వ్యక్తి, పక్కనే బరిసెతో వ్యక్తి చిత్రాలు ఉన్నాయి. గుర్రంపై రాజు, సైన్యం, ఖడ్గం వంటి ఆయుధాలు, ఆవులు, ఆవులు కాసే వారు ఇలా నాగరిక మానవుని జీవన ప్రమాణ అంశాలుగా నాటి ఆది మానవుల ఆహార, వ్యవహారాలు ప్రపంచానికి గుర్తుగా నాలుగు కాళ్ల అడవి జంతువులైన కణితి లేదా దుప్పి, నక్క, గేదె, ఆవు తదితర గుర్తులు ఉన్నాయి. మరోబండపైన యుద్ధం చేస్తున్నట్లుగా చేతుల్లో రాతి గుండులాంటి ఆయుధం, కుడిచేతిలో కర్ర లాంటి ఆయుధం పట్టుకున్నట్లు ఉన్నాయి. ఇద్దరి నడుముకు కత్తులు ధరించినట్లు ఉంది. చ ఎక్కలుగా శివలింగం పక్కనే ఊరేగింపుగా వెళ్తున్నట్టు. చేతిలో దీపాలు లాంటివి పెట్టుక ని ఉండొచ్చు. ఇలాంటి చిత్రలేఖన అనవాళ్లు రెండు యుగాలకు మధ్య సంబంధాలను సూచిస్తున్నట్టు పురావస్తుశాఖ ఇప్పటికే గుర్తించింది.
● బొగ్గులు పరిశీలన
● బొగ్గులు పరిశీలన
● బొగ్గులు పరిశీలన


