బాధితులకు భరోసా! | - | Sakshi
Sakshi News home page

బాధితులకు భరోసా!

Dec 1 2025 8:41 AM | Updated on Dec 1 2025 8:41 AM

బాధిత

బాధితులకు భరోసా!

● ఈ ఏడాది నినాదం

మదనపల్లె సిటీ: తెలిసో తెలియకో చేసిన తప్పునకు ప్రాణాంతక వ్యాధి బారిన పడుతున్నారు. తమకు రోగం ఉందని అందరికీ తెలిస్తే ఏమి జరుగుతుందోనని ఆందోళన పడుతున్నారు హెచ్‌ఐవీ బాఽధితులు. వీరికి మనోధైర్యం కల్పిస్తూ అండగా నిలుస్తుంది ఏపీ ఎయిడ్స్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌. (ఏపీ శాక్స్‌). ఎయిడ్స్‌ బాధితులకు ఐసీటీసీ కేంద్రాల ద్వారా కౌన్సెలింగ్‌ ఇస్తూ వారికి భరోసా కల్పిస్తున్నారు. బాధితులకు ఏఆర్‌టీ కేంద్రాల ద్వారా ఉచితంగా మందులు పంపిణీ చేస్తూ వారి జీవితకాలంను పెంచుతున్నారు.ఏపీ శాక్స్‌ ప్రత్యేక చర్యలతో హెచ్‌ఐవీ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. నేడు ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం సందర్భంగా కథనం....

● ప్రస్తుతం హెచ్‌ఐవీ నియంత్రణకు జిల్లాలో ’దిశ’ ఆధ్వర్యంలో బాధితులకు అవగాహన కల్పిస్తూ అవసరమైన మందులు అందజేస్తూ వారి జీవితకాలాన్ని పొడిగించుకోవడానికి కృషి చేస్తోంది. పలు స్వచ్ఛంద సంస్థలు హెచ్‌ఐవీ నివారణకు కృిషి చేస్తున్నాయి. అయినా అవగాహన లోపం కారణంగా వ్యాధి సంక్రమిస్తోంది. సురక్షితం కాని అక్రమ సంబంధాలు, స్వలింగ సంపర్కులు, తదితరుల ద్వారా వ్యాధి విస్తరిస్తోంది. జిల్లాలో ఎక్కువగా మదనపల్లె, రాజంపేట, రాయచోటి, పీలేరు ప్రాంతాల్లో అధికంగా బాధితులు ఉన్నారు.

● ఇంటిగ్రేటెడ్‌ కౌన్సెలింగ్‌ కేంద్రాలు (ఐసీటీసీ) హెచ్‌ఐవీ బాధితులకు మనోధైర్యం కల్పిస్తున్నాయి. కేంద్రాల్లో అనుమానం ఉన్న వారికి ఉచితంగా హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాజిటివ్‌ కేసులకు కౌన్సెలింగ్‌ ఇవ్వడంతో పాటు భాగస్వామికి కూడా పరీక్షలు చేస్తున్నారు. వారికి జీవితకాలం పెంపు కోసం ఏఆర్‌టీ కేంద్రాల ద్వారా ఉచితంగా మందులు అందజేస్తున్నారు.

పీపీటీసీ ద్వారా గర్భిణులకు సేవలు

గర్భిణుల కోసం ప్రత్యేకంగా పీపీటీసీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వారికి హెచ్‌ఐవీ పరీక్షలు చేస్తారు. ఎవరికై నా పాజిటివ్‌ వస్తే వారికి ప్రత్యేకంగా కౌన్సెలింగ్‌ ఇచ్చి అండగా నిలుస్తారు. తల్లి నుంచి బిడ్డకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. నెవరాపిన్‌ సిరప్‌ ఇవ్వడంతో పాటు ప్రత్యేక శ్రద్ధతో తల్లి నుంచి బిడ్డకు వ్యాధి సోకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎంతో మంది పాజిటివ్‌ గర్భిణులకు పుట్టిన బిడ్డకు జబ్బు రాకుండా చర్యలు తీసుకున్నారు.

జిల్లాలో ఐసీటీసీ కేంద్రాలు:

మదనపల్లె, వాల్మీపురం, పీలేరు,

బి.కొత్తకోట, తంబళ్లపల్లె,

రాయచోటి, లక్కిరెడ్డిపల్లె,

రాజంపేట,రైల్వేకోడూరు

ఏఆర్‌టీ కేంద్రంః మదనపల్లె

ఎఫ్‌ఐసీటీసీలు: 64

లింక్‌ ఏఆర్‌టీ ప్లస్‌లు:

రాయచోటి, రాజంపేట

లింక్‌ ఏఆర్‌టీలు: పుంగనూరు,

తంబళ్లపల్లె, బికొత్తకోట, వాల్మీకిపురం,

లక్కిరెడ్డిపల్లె,రైల్వే కోడూరు

బ్లడ్‌ బ్యాంకులు: 3

ఎన్‌జీఓలు: 4

జిల్లాలో ఎఆర్‌టీ

మందులు వాడే

వారి సంఖ్య:

4690

హెచ్‌ఐవి బాధితులకుఉచితంగా మందులు పంపిణీ

మనోధైర్యం కల్పిస్తున్న కౌన్సెలింగ్‌ కేంద్రాలు

తల్లి నుంచి బిడ్డకు రాకుండా సేవలు

హెచ్‌ఐవీ పరీక్షలు చేయించుకోండి, సమాచారం తెలుసుకోండి... సురక్షితంగా ఉండండి అనేది ఈ ఏడాది నినాదాం. ప్రతి ఒక్క రూ పరీక్షలు చేసుకుని వారి పరిస్థితి తెలుసుకోవాలనేది లక్ష్యం. ప్రధానంగా యువ త, ట్రక్కర్స్‌, వలసజీవులు, వితంతువులు ఎక్కువగా ఈ వ్యాధిబారిన పడుతున్నారు. ఇందు కోసం పాజిటివ్‌ కేసులు నమోదు అయితే వారికి భాగస్వాములతో పాటు ఇండెక్స్‌ టెస్టింట్‌ను నిర్వహిస్తున్నారు.

బాధితులకు భరోసా! 1
1/1

బాధితులకు భరోసా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement