నేడు పాఠశాలలు, కళాశాలలకు సెలవు
రాయచోటి: దిత్వా తుపాను నేపథ్యంలో ముందస్తు చర్యలలో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు డిసెంబర్ 1న సెలవు ప్రకటించారు. ఈమేరకు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రాయచోటి: దిత్వా తుఫాను హెచ్చరికల దృష్ట్యా సోమవారం రాయచోటి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించాల్సిన గ్రీవెన్‌సెల్ కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు సుదూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసాలతో కలెక్టర్ కార్యాలయానికి రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఎస్పీ ఆఫీసులో...
దిత్వా తుపాను హెచ్చరికల దృష్ట్యా సోమవారం ఎస్పీ ఆఫీసులో నిర్వహించాల్సిన గ్రీవెన్ సెల్ కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు సుదూర ప్రాంతాల నుంచి ప్రయాసాలతో జిల్లా పోలీసు కార్యాలయానికి రావద్దని ఆయన తెలిపారు.
ములకలచెరువు: ములకలచెరువు నకిలీ మద్యం కేసులో అరెస్టయ్యి మదనపల్లి సబ్ జైల్లో రిమాండ్‌లో ఉన్న ఇద్దరి నిందితుల కస్టడీ కోసం తంబళ్లపల్లె కోర్టులో ఎకై ్సజ్ పోలీసులు శనివారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఎ–24గా ఉన్న జతిన్ , ఎ–25 గా ఉన్న సిబ్బుల కోసం పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు జడ్జి ఉమర్ ఫారూఖ్ వాయిదా వేశారు. అదేవిధంగా నకిలీ మద్యం కేసులో మరో ఇద్దరి నిందితులను ఎకై ్సజ్ పోలీసులు చేర్చారు. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్ కు చెందిన చెందిల్ (ఏ30)గా , హైదరాబాద్ కు చెందిన ప్రసాద్ (ఏ31)గా చేర్చారు.
లక్కిరెడ్డిపల్లి: కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లుతున్న అనంతపురం గంగమ్మ ఆలయానికి ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కార్తీకమాసం ముగిసిన నేపథ్యంలో భక్తులు గంగమ్మకు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గంగమ్మా..కాపాడవమ్మా అని వేడుకున్నారు. పూజారులు చెల్లు వంశీయులు భక్తులకు అమ్మవారి దర్శనాన్ని కల్పించి తీర్థప్రసాదాలను అందజేశారు.చుట్టుపక్కల వారే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
రాజంపేట: ఆంధ్రప్రదేశ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించినట్లు డాక్టర్ బాలరాజు ఆదివారం ఇక్కడి విలేకర్లకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యసిబ్బంది, ఆసుపత్రుల రక్షణ చట్టాన్ని కఠినతరం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఆసుపత్రుల అనుమతులకు ఏకగవాక్ష విధానం ఉండాలన్నారు. ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలకు ఐఎంఏ సహకరిస్తుందన్నారు. ఎన్టీఆర్ వైద్యసేవ అందిస్తున్న ఆసుపత్రుల బకాయి లను వెంటనే విడుదల చేయాలన్నారు. ఐఎంఏ మాజీ అధ్యక్షుడు డాక్టర్ నందకిషోర్, ప్రెసి డెంట్ ఎలక్ట్ డాక్టర్ పీఎస్ శర్మ, ప్రధానకార్యదర్శి సుభాష్ చంద్రబోస్, ఆర్ధిక కార్యదర్శి డాక్టర్ తుమ్మల కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
నేడు పాఠశాలలు, కళాశాలలకు సెలవు


