
దేవదాయ ఆస్తులను కాపాడుకుందాం
రాయచోటి టౌన్ : దేవదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలోని ఆలయాలకు చెందిన ఆస్తులను కాపాడుకొనేందుకు మార్గదర్శకాలు అమలు చేస్తున్నట్లు తిరుపతి మల్టీజోన్ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ ఎస్‌ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ చెప్పారు. గురువారం అన్నమయ్య జిల్లా కేంద్రంలోని జిల్లా దేవదాయ శాఖ కార్యాలయంలో దేవదాయ శాఖ ఉప కమిషనర్ పట్టెం గురుప్రసాద్‌లతోపాటు అన్నమయ్య, కడప, శ్రీసత్యసాయి జిల్లాల దేవదాయ శాఖ, తనిఖీ, కార్యనిర్వహణ అధికారులతో విస్తృత సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించి మార్గదర్శకాలు సూచించారు. వాటిలో ముఖ్యమైనవి కింది విధంగా ఉన్నాయి.
● కార్యనిర్వహణ అధికారుల ఆధీనంలో ఉన్న దేవదాయల ప్రాపర్టీ రిజిస్టర్లపై పరిశీలన
● రెవెన్యూ వివరాలు నమోదు కాని వివరాల పరిశీలన
● ఆర్‌ఓఆర్ చట్టం ప్రకారం సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారులకు అప్పీలు చేయవల్సిన వివరాల పైన..
● 1బి. పట్టాదార్ పాస్ పుస్తకాలలో దేవాలయాల పేర్లు చేర్చడం, దాని కోసం మీ సేవ ద్వారా తహసీల్దార్లకు అర్జీలు ఇవ్వడం
● సంస్థల సర్వీస్ ఇనామ్ వివరాలు (ఐఎఫ్‌ఆర్/ఇనామ్–బి రిజిస్టర్/ఆర్‌ఎస్‌ఆర్ ప్రకారం
● సంస్థల భూముల లీజు/ షాప్స్, ఇతరత్రా లైసెన్స్ ఆమోదం ఉత్తర్వులు
● దేవదాయ చట్టం సెక్షన్ 83 కింద ఇప్పటి వరకు ఆక్రమణదారులకు జారీ చేసిన (ఎవికే షన్ నోటీస్) తొలగింపు నోటీసులు
● 11/33 ఏళ్ల లీజు ప్రతిపాదనలు
● జీవో 60 ప్రకారం జిల్లా కలెక్టర్ నిర్వహించిన భూ రక్షణ కమిటీ సమావేశంలో జారీ చేసిన ఆదేశాలు
● సామూహిక ఆక్రమణల (మాస్ ఎంక్రోచ్‌మెంట్) స్థితి వంటి విషయలపై చర్చించి అధికారులందరికీ మార్గదర్శకాలు జారీ చేశారు. వీటన్నింటినీ అమలు చేయాలని ఆదేశించారు.