పట్టాలెక్కిన రైల్వేవన్‌ యాప్‌ ! | - | Sakshi
Sakshi News home page

పట్టాలెక్కిన రైల్వేవన్‌ యాప్‌ !

Jul 4 2025 3:58 AM | Updated on Jul 4 2025 3:58 AM

పట్టా

పట్టాలెక్కిన రైల్వేవన్‌ యాప్‌ !

రాజంపేట : భారతీయ రైల్వే ప్రయాణికులకు అన్ని రకాల సేవలందించేందుకు రైల్వేవన్‌యాప్‌ను రైల్వేశాఖ పట్టాలెక్కించింది. రైల్వేల ద్వారా మరిన్ని మెరుగైన సేవలను అందించేందుకు ఒకే యాప్‌ను డిజైన్‌ చేసింది. ఈ నెల 1 నుంచి అమలులోకి వచ్చింది. సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (సీఆర్‌ఐఎస్‌) పేరిట తీసుకొని.. ఈ యాప్‌ ద్వారా అన్ని సేవలను అత్యంత వేగంతో యాక్సిస్‌ చేసే వీలుంటుంది.

ప్రయాణికులకు అందే సేవలు

● టికెట్‌ బుకింగ్‌, రిజర్వేషన్‌, అన్‌ రిజర్వుడ్‌, ప్లాట్‌ఫాం టికెట్‌ బుకింగ్‌

● ప్లాన్‌మై జర్నీ టూల్‌ ద్వారా వివిధ తరగతులలో కోటాలో టికెట్ల బుకింగ్‌

● అన్‌ రిజర్వుడ్‌, ప్లాట్‌ఫాం టికెట్లపై 3 శాతం డిస్కౌంట్‌

రైలు స్థితి తెలుసుకోవడం ఎలా..

● రైలు స్థితి, ప్లాట్‌ఫాం నంబరు, ఆలస్యం తదితర వివరాలు

● కోచ్‌పొజిషన్‌ పీఎన్‌ఆర్‌ స్టేటస్‌, రీఫండ్‌

● ముందస్తు రిజర్వేషన్‌ టికెట్‌ ప్రస్తుత స్ధితి గతులు, టికెట్‌ పీఎన్‌ఆర్‌ నంబరు ద్వారా సీటు కన్ఫర్మేషన్‌ స్టేటస్‌, రైళ్ల రద్దు, రిజర్వేషన్‌ రద్దు తదితర సేవలు

ఫుడ్‌ ఆర్టరింగ్‌..

● ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరజిం కార్పొరేషన్‌ లిమిటెట్‌ (ఐఆర్‌టీసీ) యాప్‌ ద్వారా వివిధ రైల్వేస్టేషన్లకు చేరుకునేందుకు ముందుగా.. నచ్చిన ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకోవడం, రైల్వేస్టేషన్‌కు రైలు చేరుకున్నాక సీటు వద్దకే ఫుడ్‌ చేర్చడం

యాప్‌ ఎలా డౌన్‌లోడ్‌...

● ఆండ్రాయిడ్‌ ఫోన్లలోనే గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకునే వీలుంది.

httpr://pay.goofe.com/sotre/a ppr/detair?orf.crir.akam

ఐవోఎస్‌ యాప్‌ నుంచి...

httpr://appr.appe.com/in/a pp.raione/id 6473384334

ఉపయోగించే విధానం..

● యాప్‌ను డౌన్‌లోడ్‌ చేశాక. రైల్‌కనెక్ట్‌ లేదా యూటీఎస్‌ యాప్‌ లాగిన్‌ వివరాలతో లాగిన్‌ కావాలి.

● కొత్త వినియోగదారులు మొబైల్‌ నంబరు, ఓటీపీ ద్వారా రిజిస్టర్‌ చేసుకోవాలి.

● mPIN లేదా బయోమెట్రిక్‌ ద్వారా సులభంగా లాగిన్‌ కావచ్చు.

● ప్లాన్‌ మై జర్నీ లేదా మై బుకింగ్‌ వంటి ఆప్షన్లను ఉపయోగించి సేవలను యాక్సెస్‌ చేయవచ్చు.

ఇవీ ప్రయోజనాలు..

● ఒకే యాప్‌లో ఐఆర్‌టీఎస్‌ రైల్‌ కనెక్ట్‌, యూటీఎస్‌, రైల్‌మదద్‌, ఎన్‌టీఈఎస్‌, ఫుడ్‌ ఆన్‌ ట్రాక్‌ వంటి సేవలు

● బహుళ యాప్‌ల అవసరం తగ్గించి, డివైస్‌ స్టోరేజి ఆదా చేసుకోవచ్చు.

● సరళమైన ఇంటర్‌సేఫ్‌, సింగల్‌ సైన్‌–ఆన్‌ ద్వారా ఉపయోగం సులభతరం

● 2025 డిసెంబర్‌ నాటికి కొత్త పీఆర్‌ఎస్‌ సిస్టమ్‌ ద్వారా నిమిషానికి 1.5 లక్షల టికెట్స్‌ బుకింగ్‌, 40 లక్షల ఎంకై ్వరీలు నిర్వహించగల సామర్థ్యం.

స్పీడ్‌గా అన్ని రకాల సేవలు

అందుబాటులోకి వచ్చిన యాప్‌

ఐఆర్‌టీఎస్‌తో ఫుడ్‌ ఆర్డరింగ్‌

నిమిషానికి 1.5 లక్షల

టికెట్ల బుకింగ్‌ లక్ష్యం

పట్టాలెక్కిన రైల్వేవన్‌ యాప్‌ !1
1/1

పట్టాలెక్కిన రైల్వేవన్‌ యాప్‌ !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement