
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
కమలాపురం : కమలాపురం మండలంలోని కంచన్నగారిపల్లె గ్రామ సమీపంలో పెన్నా నది వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న 13 ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్‌ఐ విద్యా సాగర్ తెలిపారు. గురువారం ఇసుక అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం రావడంతో ఎస్‌ఐ పోలీస్, రెవెన్యూ సిబ్బందితో కలసి పెన్నా నది వద్దకు చేరుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న 13 ట్రాక్టర్లను పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై కేసు నమోదు చేస్తామని ఎస్‌ఐ తెలిపారు. కాగా అనుమతులు లేకుండా ఇసుక, మట్టి, గ్రావెల్ తరలిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్‌ఐ హెచ్చరించారు.
మోటారు సైకిల్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
పులివెందుల రూరల్ : పులివెందుల మండలం కనంపల్లె – ఓదులపల్లి తండా గ్రామాల మధ్యలో గురువారం మోటార్ సైకిల్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో నలుగురికి గాయాలయ్యాయి. శ్రీసత్యసాయి జిల్లా తలుపుల మండలం ఉడుములకుర్తి నుంచి ద్విచక్ర వాహనంలో గంగరాజు తన కుమారులు ఈశ్వర్, దేవేంద్రతోపాటు భార్యతో కలిసి పులివెందులలోని సర్వజన ఆసుపత్రికి వస్తుండగా.. కనంపల్లె గ్రామ సమీపంలోని ఓదులపల్లె తండా వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఈశ్వర్, దేవేంద్రతోపాటు గంగరాజు, అతని భార్యకు గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో పులివెందుల సర్వజన ఆసుపత్రికి తరలించారు.

ఇసుక ట్రాక్టర్ల పట్టివేత