
దరఖాస్తుల ఆహ్వానం
పెనగలూరు: పెనగలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న ఇంగ్లీషు పోస్టు కసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంగ్లీషు పోస్టు (గెస్ట్ ఫ్యాకల్టీ) అర్హులైన వారి నుంచి ఈనెల 7వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఎంఏ ఇంగ్లీషు కనీసం 50 శాతం మార్కులు కలిగి ఉండాలన్నారు. ఈనెల 8వ తేదీ డెమో క్లాసులు కళాశాలలో ఉదయం పది గంటలకు నిర్వహించనున్నట్లు చెప్పారు. డెమో క్లాసుల అనంతరం ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు. కావున అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
నీరు భూమిలోకి ఇంకిపోవాలి
సంబేపల్లే: వర్షపు నీరు, మురికి నీరు భూమిలోకి ఇంకిపోయే విధంగా డ్రేనేజీలు ఉండాలని ఉపాధి పీడీ వెంకటరత్నం తెలిపారు. గురువారం మండల పరిధిలోని రెడ్డివారిపల్లెలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో మ్యాజిక్ డ్రైన్ గుర్తించారు. ఇళ్లలో నుంచి వస్తున్న నీరు మ్యాజిక్ డ్రైన్‌కు అనుసంధానం చేసి భూమిలోకి ఇంకిపోయే విధంగా నిర్మాణం చేపట్టాలన్నారు. మండలంలోని ప్రతి గ్రామంలో ఇలాంటి మ్యాజిక్ డ్రైన్ నిర్మాణాలు ఎక్కడ అవసరమో చూడాలని ఆయన సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ మధబాబు, ఏపీఓ రెడ్డిజవహర్, జేఈ వెంకట చలపతి తదితరులు పాల్గొన్నారు.
80 శాతం రాయితీతో
రైతులకు డ్రోన్లు
మదనపల్లె రూరల్: వ్యవసాయాన్ని లాభసాటి చేయాలనే ఉద్దేశంతో దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వం 80 శాతం రాయితీతో రైతులకు డ్రోన్లను అందిస్తోందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి శివనారాయణ తెలిపారు. జిల్లా వ్యవసాయశాఖ అఽధికారిగా బాధ్యతల స్వీకరణ అనంతరం గురువారం తొలిసారిగా మదనపల్లె పర్యటనకు వచ్చిన ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. డ్రోన్ల సహాయంతో రైతులు ఎరువులు, పురుగుమందులు పిచికారీ చేసుకోవచ్చన్నారు. డ్రోన్ ఒకో యూనిట్‌ఽ ధర రూ.9.80. ఇందులో రైతుల వాటారూ.1.96లక్షలు పోనూ, మిగిలిన రూ.8లక్షలు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. జిల్లాలో తొలిసారిగా పీటీఎం మండలంలో వెంకటేశ్వర గ్రూప్‌కు డ్రోన్ మంజూరుచేశామన్నారు. జిల్లాలో 97 శాతం ఈకేవైసీ పూర్తయిందన్నారు. అనంతరం ఏడీఏ ఆర్.రమేష్‌తో కలిసి మండలంలోని అంకిశెట్టిపల్లెలో రైతు లక్ష్మీ ఫీల్డ్ విజిట్‌లో పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో రైతులు ప్రకృతి వ్యవసాయ విధానాలను అవలంభించి భవిష్యత్తులో ఆర్థికంగా, సుస్థిరంగా నిలవాలన్నారు. కార్యక్రమంలో డీపీఎం డి.వెంకట్‌మోహన్, ఏఓ నవీన్ తదితరులు పాల్గొన్నారు.