పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీల సెల్ఫ్ గోల్

Self goal of TDP MPs in Parliament Vijayasai Reddy Tweet - Sakshi

సాక్షి, ఢిల్లీ:  పార్లమెంటు సాక్షిగా తెలుగుదేశం పార్టీ ఎంపీలు సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. రైతుల ఆత్మహత్యల అంశంతో వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని ప్రయత్నించి.. వాళ్లే ఇరుకున పడ్డారు. ఈ విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు  విజయసాయి రెడ్డి బుధవారం ఓ ట్వీట్ ద్వారా తెలియజేశారు. 

రైతుల ఆత్మహత్యల విషయాన్నీ ప్రస్తావించి భంగపడ్డారు. వైయస్ జగన్ ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాల వల్ల 2019 నుంచి ఇప్పటిదాకా రైతుల ఆత్మహత్యలు 25% తగ్గాయి.  ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ  నివేదికలో ప్రకటించిందని లెక్కలతో సహా అసలు విషయాన్ని విజయసాయి రెడ్డి ట్వీట్‌ ద్వారా వెల్లడించారు.

లోక్‌సభలో టీడీపీ ఎంపీ కేశినేని నాని అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల ఆత్మహత్యలు తగ్గినట్లు ఆ సమాధానం ద్వారా స్పష్టం అయ్యింది కూడా.

మరిన్ని వార్తలు :

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top