చిత్తూరు జిల్లాలో స్వల్పంగా కంపించిన భూమి

Earthquake At Chittoor District Punganur Mandal - Sakshi

సాక్షి, చిత్తూరు జిల్లా: ఓ వైపు మూడు రోజులుగా కురుస్తున్న భారీ​ వర్షాలతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. మరో విపత్తు ప్రజలను మరింత భయభ్రాంతులకు గురి చేసింది. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో శుక్రవారం భారీ శబ్దాలు వినిపించాయి. ఉదయం నుంచి రెండుసార్లు శబ్దాలు రావడంతో జనాలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. 

దాదాపు 6 సెకన్ల పాటు భూమి కంపిచినట్లు సమాచారం. ఈడిగపల్లి, చిలకావారిపల్లి, షికారు, గూడవారిపల్లిలో ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ సంఘటనలతో తీవ్రంగా భయపడిన జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top