
సాక్షి, అమరావతి: స్వాతంత్య్రం వచ్చాక ఎస్సీల సంక్షేమం కోసం అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నాం.. ఏపీ చరిత్రలో దళితుల సంక్షేమానికి పెద్దపీట వేసిన సీఎం దివంగత వైఎస్సార్ అయితే, ఆయనకంటే మిన్నగా ఎస్సీల సంక్షేమానికి అగ్రతాంబూలం ఇస్తున్న నేత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా డీబీటీ, నాన్ డీబీటీ పథకాల ద్వారా ఎస్సీల కోసమే ఏకంగా రూ.63,689 కోట్లు ఖర్చు చేశామన్నారు.
శాసనసభ సమావేశాల మూడో రోజు సోమవారం ఉదయం జరిగిన ప్రశ్నోత్తరాల్లో సభ్యులడిగిన ప్రశ్నలకు మంత్రి నాగార్జున సమాధానం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాల పథకాల్లో లబ్ధి ఎస్సీ, ఎస్టీలే ఎక్కువగా పొందుతున్నారని చెప్పారు.
డీబీటీ ద్వారా.. వసతి దీవెన కింద రూ.834.96 కోట్లు, జగనన్న విద్యా దీవెన కింద రూ.2,081.54 కోట్లు, జగనన్న విదేశీ విద్యా దీవెన ద్వారా రూ.14.97 కోట్లు, రైతు భరోసా కింద రూ.3,202.15 కోట్లు, సున్నా వడ్డీ పంట రుణాల కింద రూ.83.38 కోట్లు, ఉచిత పంటల బీమా ద్వారా రూ.393.06 కోట్లు, ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ.160.23 కోట్లు, మత్స్యకార భరోసా రూ.6.10 కోట్లు, డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ పథకం కింద రూ.817.61 కోట్లు, పెన్షన్ కానుక రూపంలో రూ.13,410.52 కోట్లు, వైఎస్సార్ చేయూత కింద రూ.3,353.37 కోట్లు, ఆసరా కింద రూ.3,721.92 కోట్లు, వైఎస్సార్ బీమా కింద రూ.449.40 కోట్లు, నేతన్ననేస్తం కింద రూ.10.61 కోట్లు, చేదోడు కింద రూ.71.19 కోట్లు, లా నేస్తం రూపంలో రూ.8.85 కోట్లు, వాహన మిత్ర కింద రూ.244.91 కోట్లు, ఆరోగ్య ఆసరా కింద రూ.170.94 కోట్లు, ఆరోగ్యశ్రీ కింద రూ.1,425.81 కోట్లు, కళ్యాణమస్తు కింద రూ.102.25 కోట్లు.. ఇలా పలు పథకాల కింద మొత్తంగా రూ.60,530.71 కోట్లు ఖర్చుచేసినట్టు చెప్పారు.
ఇతర సాంఘిక సంక్షేమ శాఖల ద్వారా చేసిన ఖర్చుతో కలుపుకుంటే ఇప్పటి వరకు రూ.63,689 కోట్లు ఖర్చు చేసినట్టు వెల్లడించారు. గత ప్రభుత్వం 2014–19 మధ్యలో ఎస్సీల సంక్షేమానికి కేవలం రూ.35,250.46 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. విద్యా దీవెన పథకాన్ని పీజీ స్థాయి వరకు వర్తింపజేస్తే.. ఎస్సీలకు మేలు జరుగుతుందని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లబాబూరావు కోరారు. uభూమిలేని ఎస్సీలకు కనీసం 50 సెంట్ల స్థలం ఇచ్చే ప్రతిపాదనను సీఎం పరిశీలించాలని గూడూరు ఎమ్మెల్యే వి.వరప్రసాద్ కోరారు. గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మాట్లాడుతూ ఎస్సీల కోసం ప్రత్యేకంగా కమ్యూనిటీ హాళ్ల నిర్మాణంపై దృష్టి సారించాలన్నారు.
పార్లమెంటరీ నియోజకవర్గానికి
ఒక ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్ : మంత్రి కాకాణి
రాష్ట్రంలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి వెల్లడించారు. ప్రశ్నోత్తరాలలో సభ్యులడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇస్తూ తొలి దశలో రూ.1,250 కోట్లతో 9 సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, 13 సెకండరీ మిల్లెట్స్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు పరిపాలనామోదం ఇచి్చనట్టు తెలిపారు. 34 కోల్డ్ స్టోరేజ్‌లు నిర్చించగా.. ఇప్పటికే 29 కోల్డ్ స్టోరేజ్‌లకు రూ.24.54 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. అలాగే రూ.117.29 కోట్లతో 1932 సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, రూ.1,069.59 కోట్లతో 44 ఇతర ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేశామన్నారు.
వైఎస్సార్ బీమా కింద 100 శాతం ప్రభుత్వమే చెల్లిస్తోంది.. : మంత్రి గుమ్మనూరు
కారి్మక శాఖమంత్రి గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ పీఎంజేజేబీవై, ఏఏబీవై, పీఎంఎస్‌బీవై పథకాలను కేంద్రం నిలిపివేయడంతో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ బీమా పథకం కింద పేద, దారి్రద్యరేఖకు దిగువనున్న వారందరికీ 100 శాతం ప్రీమియంను భరిస్తూ బీమా కవరేజ్ కలి్పస్తోందన్నారు.