
విజయవాడ: ఏపీలో మెడికల్ కాలేజీలు అమ్మకానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది చంద్రబాబు కేబినెట్. రాష్ట్రంలోని పలు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలని కేబినెట్ నిర్ణయించింది. 10 మెడికల్ కాలేజీలను పీపీపీలో ప్రైవేటుపరం చేయాలని నిర్ణయించింది.
గత వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన మెడికల్ కాలేజీలపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపుల్లో భాగంగా ప్రభుత్వ రంగంలోని నిర్మాణాలను ప్రైవేటుకు అప్పగించేయడానికి సిద్ధమైంది. తొలి దశలో మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని కాలేజీలను, రెండో దశలో అమలాపురం, బాపట్ల, పెనుకొండ, నర్సీపట్నం, పాలకొల్లు, కళాశాలల ప్రైవేటీకరణ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
వైఎస్ జగన్ హయాంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టగా, వైఎస్ జగన్ ప్రభుత్వం హయాంలోనే 5 మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి..
నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం మెడికల్ కాలేజీల్లో 2023–24లో ప్రారంభం కాగా, గతేడాది పాడేరు వైద్య కళాశాలల్లో తరగతులు ప్రారంభమైంది. గత వైఎస్ జగన్ సర్కారు రూ. 8,450 కోట్లతో మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టగా, అన్నింటినీ ప్రైవేటుకు అప్పగించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయంతో పేదలకు విద్యను ఎలా దూరం చేస్తున్నారనడాకి నిదర్శనంగా నిలుస్తుంది.