
కలుషిత నీరు కలకలం
గుంతకల్లు: కలుషిత నీరు కలకలం సృష్టించాయి. వాంతులు, కడుపునొప్పితో బాధితులు ఆస్పత్రికి పరుగులు తీశారు. వివరాలు.. శనివారం ఉదయం గుంతకల్లు పట్టణంలోని పలు చోట్ల మున్సిపల్ కుళాయిలకు నీళ్లు వదిలారు. ఈ క్రమంలోనే స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద సాయిక్రిష్ట ఆస్పత్రి సమీపంలో నివాసముంటున్న వారు కుళాయి నీళ్లను పట్టుకుని తాగారు. కొంతసేపటికే వాంతులు, విరేచనలు, కడుపు నొప్పి మొదలవడంతో వనజ, స్వాతి, గీతమ్మ, దీపక, భరత్, కళ్యాణీ, చిట్టక్క, బ్రహ్మ, భీమలింగా, రామ్ లక్ష్మణ్, కార్తీక్, ఉదయ్‌తోపాటు మరో 10 మంది లబోదిబోమంటూ స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి పరుగులు పెట్టారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి ఆరుగురిని అడ్మిట్ చేసుకున్నారు. మిగిలిన వారికి ప్రాథమిక చిక్సితలు అందించి ఇంటికి పంపారు. కుళాయి నీళ్లు ఎర్రగా ఉండటంతో పాటు వాసన వెదజల్లాయని రోగులు తెలిపారు. పురుగులు కూడా కనిపించాయన్నారు. తమ ప్రాంతంలో మురికి కాలవలు శుభ్రం చేయకపోవడంతో చెత్త చెదారం పేరుకు పోయిందన్నారు. మున్సిపల్ అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడంతో కుళాయిల్లో కలుషిత నీరు వస్తున్నాయని వాపోయాచారు.
● రోగులను వైఎస్సార్‌సీపీ వార్డు ఇన్‌చార్జ్ మార్కెట్ వెంకటేష్ పరామర్శించారు. విషయాన్ని వైద్యారోగ్య శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో తిలక్‌నగర్ అర్బన్ హైల్ సెంటర్ డాక్టర్ స్వాతి, ఏఎన్‌ఎం శ్రీలత, ఆశా వర్కర్ జానికి వెంటనే ఆ ప్రాంతంలో పర్యటించారు. అందరికీ ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు పంపిణి చేశారు. నీళ్లను బాగా వేడి చేసి చల్లార్చిన తరువాత తాగాలని డాక్టర్ స్వాతి సూచించారు.
గుంతకల్లులో వాంతులు, విరేచనాలతో ఆస్పత్రికి బాధితుల పరుగులు