
తాడిపత్రిటౌన్: జగనన్న ప్రభుత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు జరిగిన మేలును వివరించేందుకు వైఎస్సార్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర ఈ నెల 27న తాడిపత్రిలో నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తెలిపారు. బుధవారం తాడిపత్రిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, తాడిపత్రి, పెద్దపప్పూరు మండల నాయకులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి, జిల్లా అధ్యక్షుడు పైలా మాట్లాడుతూ జగనన్న పాలనలో ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు తీసుకొచ్చారన్నారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పదవులు, నామినేటెడ్ పోస్టుల్లో పెద్దపీట వేశారన్నారు. పట్టణంలో జరిగే సామాజిక సాధికార బస్సు యాత్రకు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరవుతారన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని యాత్రను విజయవంతం చేసేలా విస్తృత ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో చింతల వేంకటరమణస్వామి ఆలయ కమిటీ చైర్మన్ కందిగోపుల మురళీప్రసాద్‌రెడ్డి, ఉపాధి హామీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు వేమనాథరెడ్డి, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ రాజు, మార్కెట్‌యార్డ్ వైస్ చైర్మన్ ఓబులరెడ్డి, నాయకులు వెంకటరెడ్డిపల్లి పుల్లారెడ్డి, రామేశ్వరెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, కన్వీనర్ పల్లె నాగేశ్వరెడ్డి, హనుమంతరెడ్డి, సూర్యనారాయణ, పెద్దపప్పూరు మండల నాయకులు ఎంపీపీ రామిరెడ్డి, జెడ్పీటీసీ రవిప్రసాద్‌రెడ్డి, ఎంపీటీసీ రామ్మూర్తిరెడ్డి, కన్వీనర్ అమర్‌నాథరెడ్డి, ముచ్చుకోట యోగేశ్వరెడ్డి, రామాంజులరెడ్డి పాల్గొన్నారు.
విజయవంతం చేయండి
పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే పెద్దారెడ్డి పిలుపు